ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ విక్రయదారులు, రిఫైనర్స్ జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ (జీఈఎఫ్ ఇండియా) స్థిరమైన-పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రోత్సహించే తమ ప్రయత్నాలలో భాగంగా 10,000 పర్యావరణ అనుకూల విత్తన గణేశ బాక్స్ లను పంపిణీ చేస్తుంది. వాతావరణ మార్పుల యొక్క ప్రతికూలతల గురించి ప్రజలు అవగాహన పొందుతున్నారు. పర్యావరణ అనుకూల గణేశుడిని పూజించడం ద్వారా పర్యావరణ అనుకూల మతపరమైన వేడుకలను వేగంగా స్వీకరిస్తున్నారు.
ఈ విగ్రహాల నిమజ్జనం నీటి వనరులపై ఎటువంటి ప్రమాదకర ప్రభావాన్ని చూపనందున, దీన్ని ప్రోత్సహించడానికి ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ హైదరాబాద్‌లో 7,000 పర్యావరణ అనుకూల విత్తన గణేశ బాక్స్ లను & బెంగళూరులో 3,000 పర్యావరణ అనుకూల విత్తన గణేశ బాక్స్ లను పంపిణీ చేస్తుంది. రెయిన్‌బో విస్టా (ఫేజ్ 1&2), మలేషియా టౌన్‌షిప్, అపర్ణ సరోవర్, ఎన్‌సిసి అర్బన్ మాదాపూర్, స్వాన్‌లేక్ అపార్ట్‌మెంట్, మూసాపేట్, రిడ్జ్ టవర్స్, ఐడిపిఎల్ , మై హోమ్ జ్యువెల్, ఇండిస్ వన్ సిటీ కేపీహెచ్బి , శాటిలైట్ టౌన్‌షిప్, కొంపల్లి, సత్యనారాయణ ఎన్‌క్లేవ్ చందా నగర్ మొదలైనవి. అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లకు పర్యావరణ అనుకూలమైన విత్తన వినాయకుడిని పంపిణీ చేయడానికి శ్రీ చేతన్ పింపాల్‌ఖుటే, డిజిఎం మార్కెటింగ్, ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ బృందంతో కలిసి వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.
గణేశుడి విగ్రహాలను ప్రతిష్టించే సంస్కృతి చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేయబడిన , ఆకర్షణీయమైన కమర్షియల్ పెయింట్‌లతో అలంకరించబడిన సాంప్రదాయ విగ్రహాలు నీటిలో నిమజ్జనం చేసిన తర్వాత నీటిలో కరగటానికి మరియు ఆ రసాయనాలు, పదార్ధాలను నీటి నుండి తొలగించబడటానికి సమయం పడుతుంది. పర్యావరణంపై చైతన్యం పెరగడంతో కృత్రిమ రంగులు వేయని మట్టి విగ్రహాలకే ఇటీవల కాలంలో మొగ్గు చూపుతున్నారు. గణేష్ ఉత్సవాల వల్ల కలిగే పర్యావరణ ప్రభావాన్ని కనిష్టంగా ఉంచడానికి, మట్టి, కరిగే గణేష్ విగ్రహాలను సేంద్రీయ ఎరువులు, మొక్కలు ఎదిగే సామర్థ్యం గల విత్తనాలతో కూడి ఉన్నవాటిని ప్రజలు తీసుకోవడం ప్రారంభించారు. ఒకసారి కుండలో నిమజ్జనం చేస్తే, విగ్రహాలలో లభించే విత్తనాలతో గణేష్ విగ్రహం ఒక మొక్కగా పెరుగుతుంది. ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ – గ్రీన్ గణేశ కార్యక్రమం ఉత్సవాలలో రాజీ పడకుండా పర్యావరణ హానిని తగ్గించడానికి వారి చేతన ప్రయత్నానికి నిదర్శనంగా ఉపయోగపడుతుంది.
ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ సేల్స్ & మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి చంద్ర శేఖర రెడ్డి ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ, “మన ఇళ్లలో గణేశుడి విగ్రహాన్ని ఉంచడం ద్వారా గణేష్ పండుగ జరుపుకోవడం మన సంప్రదాయంలో ఒక భాగం. ప్రజలు సంప్రదాయ ఉత్సాహంతో పండుగను జరుపుకోవడానికి మరియు పర్యావరణాన్ని పరిరక్షించడానికి, ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ 10,000 పర్యావరణ అనుకూలమైన విత్తన గణేశ విగ్రహాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. మేము 5 సంవత్సరాలుగా పర్యావరణ అనుకూలమైన విత్తన గణేశ విగ్రహాలను పంపిణీ చేస్తున్నాము. గ్రీన్ గణేశ కార్యక్రమంతో మేము ప్రజలకు పండుగను సాంప్రదాయ ఉత్సాహంతో స్థిరమైన, పర్యావరణ అనుకూల మార్గంతో వేడుక జరుపుకోవడానికి స్వేచ్ఛను ఇస్తున్నాము” అని అన్నారు.