గార్ల మండల కేంద్రంలోని స్థానిక తాసిల్దార్ బజార్ లో గత వారం రోజుల క్రితం సైడు డ్రైనేజీ లోని వ్యర్ధాలను చెత్తను తొలగించి, రోడ్డుకు ఇరువైపులా వేశారు. దీంతో వాహనచోదకులు, పాదచారులు, ఆ మార్గం గుండా రాకపోకలు సాగించేందుకు అవస్థలుపడుతున్నారు. చెత్తను తొలగించలేకపోవడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు, రోడ్డుపై ఉన్న మురుగు నిల్వలు చెత్తా చెదారం మరల కాలువలోకి వెళుతూ వీధి మొత్తం బురదమయంగా తయారవ్వడమే, కాకుండా దుర్గంధం వెదజల్లుతూ ఇంటి ముందు కూర్చోలేని పరిస్థితి ఏర్పడింది మురుగు నిలువలతో,
సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని. తక్షణమే చెత్తను తొలగించి రాకపోకలకు సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.