Friday, September 20, 2024
HomeNewsChegunta-Teacher's day: వడియారంలో ఉపాధ్యాయ దినోత్సవం

Chegunta-Teacher’s day: వడియారంలో ఉపాధ్యాయ దినోత్సవం

చేగుంట మండలం వడియారం గ్రామంలో డా౹౹ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ప్రాధమిక పాఠశాల వడియారంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ప్రధానోపాధ్యాయులు కర్రే సిద్ధిరాములు మాట్లాడుతూ అన్ని రంగాలలో ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగస్తులను తయారు చేసేటటువంటి అవకాశం ఉపాధ్యాయులకే ఉంటుందని, సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర ఎంతో విలువైనదని, విద్యార్థులు చక్కగా చదువుకొని, ఉన్నత స్థాయిలో మంచి పేరు పొందాలని, నైతిక విలువలు పెంచుకొని సంస్కారవంతంగా ఎదగాలని ఆకాంక్షించారు.

- Advertisement -

విద్యార్థులు వివిధ పువ్వులను సేకరించి దండలుగా తయారు చేసి పాఠశాలలోని ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కర్రే సిద్ధిరాములుతో పాటు ఉపాధ్యాయులు ప్రియదర్శిని, వసంత, సంతోషిమాత, అమరేశ్వరి, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News