సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదల పాలిట వరమని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. శుక్రవారం స్థానిక సొసైటీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని 62 మంది లబ్ధిదారులకు 15 లక్షల 21 వేల 500 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వారి ఆరోగ్య పరిరక్షణకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అండగా ఉంటుందన్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టపరిహారాన్ని మండల వ్యవసాయ అధికారులు అంచనా వేసి జిల్లా కలెక్టర్లకు నివేదికను సమర్పించాలన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. విద్యుత్ సబ్సిడీ రానివారు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మంగమ్మ డిప్యూటీ తాసిల్దార్ సుధాకర్ సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గా ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధనియాకుల రామారావు సొసైటీ డైరెక్టర్ శీలంశెట్టి ప్రవీణ్ కుమార్ మండల వ్యవసాయ అధికారి రామారావు ఎస్సై జీనత్ కుమార్ పార్టీ నాయకులు రాము గౌడ్ భూక్య నాగేశ్వరరావు యాకుబ్ పాషా బాబూలాల్ సురేష్ వీరస్వామి రామ్ సింగ్ నాగార్జున తదితరులు ఉన్నారు.