ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం అందించేలా కార్యకర్తలు కృషి చేయాలని బి.జె.పి జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు డీ.కే. అరుణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం బాచుపల్లి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అరుణ ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తూ గత పార్లమెంట్ ఎన్నికల్లో మన పార్టీకి వచ్చిన ఓట్ల కంటే ఎక్కువగా పార్టీ సభ్యత్వాలను నమోదు చేయించాలన్నారు.
మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఎన్నికల్లో డోర్-టు – డోర్ క్యాంపెనింగ్ విధంగా ప్రతి ఇంటికి భా.జ.పా కార్యకర్తలు సందర్శించి సభ్యత్వాలు చేయించాలన్నారు. దేశంలోనే అతిపెద్ద సంఖ్యలో పార్టీ సభ్యత్వం ఉన్న పార్టీ బి.జె.పి నే అన్నారు.
కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్. ఎస్. మల్లారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మువ్వ జయశ్రీ, మాధవి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధా, ఓ బి సి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గిరి వర్ధన్ రెడ్డి, నరహరి తేజ, విగ్నేశ్వర్, ఉపాధ్యక్షులు బక్క శంకర్ రెడ్డి, శేఖర్, డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత, పున్నారెడ్డి, పత్తి సతీష్, దుర్యోధన, కంది శ్రీరాములు, పులి బలరాం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సమావేశానికి వచ్చిన నేతలను గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి పండ్ల బొకేలను ఇచ్చి స్వాగతం పలికారు.