Friday, November 22, 2024
HomeతెలంగాణTSPCB: కాలుష్య నియంత్రణపై సమీక్ష

TSPCB: కాలుష్య నియంత్రణపై సమీక్ష

తెలంగాణలో కాలుష్య నియంత్రణపై ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్ సమీక్షించారు. ఉద్గార జాబితా, మూల నిష్పత్తి, హైదరాబాద్ నగర ఉద్గార వాహక సామర్థ్థ్యం వంటి అంశాలపై పరిశోధన పత్రాలను తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఐఐటీ కాన్పూర్ కు నివేదించింది. కాలుష్య మూలాలన్నీరహదారుల ధూళి, వాహనాల ఉద్గారాలు, బహిరంగ దహనం, ఇతర కాలుష్య కారకాలు, పరిశ్రమలు వాయు కాలుష్యానికి కారణాలుగా నిలుస్తున్నాయని ప్రొఫెసర్ ముఖేశ్ శర్మ అన్నారు. వీటి ప్రభావాన్ని తగ్గించేందుకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు. ఎయిర్ క్వాలిటీని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్రం సమర్ధవంతంగా వినియోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు. నల్గొండలో గాలి కొలమానాలు సాధారణ పరిస్థితిలో ఉన్నాయని, హైదరాబాద్ లో సాధారణంగా కావాల్సి ఉందన్నారు. ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ 30వేల టన్నుల నుంచి 44వేల టన్నులకు చేరుకోవడం మంచి పరిణామంగా అభిప్రాయపడ్డారు. అయితే డమెస్టిక్ ఈ-వేస్ట్ పై ప్రజల్లో చైతన్యం పెంచాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్ మాట్లాడుతూ కన్ స్ట్రక్షన్ వ్యర్థాల నిర్వహణ మరింత సమర్థవంతంగా జరగాలన్నారు.

- Advertisement -

ఈ సమీక్షలో ఐఐటీ కాన్పుర్ నిపుణుల టీంతో పాటు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ నీతూ ప్రసాద్, జాతీయ కాలుష్య నియంత్రణ మండి నిపుణుల కమిటీ సభ్యులు డాక్టర్ బి. సేన్ గుప్తా, ఎన్ఈఈఆర్ఐ శాస్త్రవేత్త డాక్టర్ టివిబిఎస్ రామక్రిష్ణ, ఐఐటీహెచ్ కు చెందిన డాక్టర్ ఆసిఫ్ ఖురేషి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News