ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి హేమమైన చర్య… శాంతి భద్రతలను కాపాడటంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలం అయ్యందని శాసన సభ్యున్నిపై జరిగిన దాడికి సిఎం రేవంత్ రెడ్డి క్షమపణ చెప్పాలని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తు గోదావరి బిడ్జిపై మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరికపూడి గాంధీ అనుచరులను వెంట వేసుకొని తోటి ఒక శాసనసభ్యుడిపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. నేను కాంగ్రెస్ లో చేరలేదు ఇంకా బి.ఆర్.ఎస్. పార్టీలోనే ఉన్న అన్న అరికపూడి గాంధీ మాటలకు… కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా రేపు ఉదయం అరికపూడి ఇంటికి వెళ్లి ఇంటిపై బి.ఆర్.ఎస్. జెండా ఎగురవేసి అతనికి పార్టీ కండువా కప్పి కేసీఆర్ దగ్గరికి తీసుకెళుతానని మాట్లాడటం జరిగిందన్నారు. రాజకీయాల్లో దానికి మీ అభిప్రాయం చెప్పాలి కానీ సమాధానం చెప్పకుండా కౌశిక్ రెడ్డిపై వాడరాని భాష మాట్లాడుతూ ఇంటిపై దాడికి రావడం సిగ్గు చేటని … కౌశిక్ రెడ్డి ని పోలీసులతో ఇంటిలోనే నిర్బంధించిన ప్రభుత్వం, అరికపూడి గాంధీని మాత్రం వందలాది అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటిపైకి వెళ్ళి దాడి చేసేలా ఉసిగొల్పిందన్నారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తున్నా కూడ చూస్తు నివారించక పోవడం కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమని, ఇది ప్రజా పాలన కాదు పోలీస్ గుండా పాలన సాగుతుందని నిరసనలు కూడ తెలుపకుండా అరెస్ట్ చేసి జైపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారని తెలిపారు .
అరెస్ట్ ఆయిన వారిలో పెంట రాజేష్, బొడ్డు రవీందర్.నూతి తిరుపతి.జక్కుల తిరుపతి, కృష్ణవేణి.గాదం విజయ.గుంపుల లక్ష్మి.సంద్యారెడ్డి.స్వప్న.తిరుమల.లింగాపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్.ప్రశాంత్.శ్రావణ్.బొబ్బిలి సతీష్.లు ఉన్నారు.