Friday, November 22, 2024
Homeహెల్త్Skin care: పట్టులాంటి చర్మానికి యాంటి-ఇన్ఫ్లమేటరీ డైట్

Skin care: పట్టులాంటి చర్మానికి యాంటి-ఇన్ఫ్లమేటరీ డైట్

యాంటి ఇన్ఫ్లమేటర్ ఫుడ్ తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండడమే కాదు ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. ఇంతకూ అవేమిటంటే..

- Advertisement -

 కార్బోహైడ్రేట్స్, వేపుళ్లు, జంక్ ఫుడ్, రెడ్ మీట్, సోడా, షుగర్ వంటివి చర్మాన్ని కాంతివిహీనంగా ఉండేట్టు చేస్తాయి. అంతేకాదు చర్మ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. కాబట్టి ఇలాంటి ఆహారానికి దూరంగా ఉండడం మొదట చేయాలి.

 యాంటి ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ చర్మాన్ని మ్రుదువుగా, మెరిసేలా ఉండేలా చేస్తాయి. టొమాటో అలాంటిదే. ఇందులో లైకోపెనె, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి. అంతకాదు టొమాటోల్లో యాంటాక్సిడెంట్లు కూడా బాగా ఉండడంతో వాటిని తినడం వల్ల చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అన్ని రకాల ఆహారపదార్థాల్లో టొమాటో వేసి వండొచ్చు.

 వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎన్నో ఉన్నాయి. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది. ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది. సబ్జీల్లో, దాల్ లో దీనిని వేసుకుంటే పదార్థం ఎంతో సువాసనలు చిందించడంతో పాటు రుచిగా కూడా ఉంటుంది.

 పాలకూర, అన్నిరకాలైన ఆకుకూరల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ సుగుణాలు ఉన్నాయి. విటమిన్ సి కూడా వీటిల్లో పుష్కలంగా ఉంది. ఇది శక్తివంతమైన యాంటాక్సిడెంటుగా పనిచేస్తుంది. చర్మాన్ని మ్రుదువుగా, కాంతివంతంగా ఉండేట్టు చేస్తుంది. అందుకే నిత్యం మీరు తీసుకునే డైట్ లో ఆకుకూరలు ఉండేట్టు చూసుకోవాలి. రోజూ ఆకుకూరలు తినడం వల్ల మీ చర్మం ఆరోగ్యకరంగా తయారవుతుంది.

 నట్స్ లో పోషకవిలువలు అధికంగా ఉంటాయి. వీటిల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్సు ఉంటాయని పలు అధ్యయనాల్లో కూడా తేలింది. బాదం, వాల్ నట్స్, జీడిపప్పులు, దోసగింజలు, సన్ ఫ్లవర్ గింజలు, నువ్వులు స్కిన్ కేర్ కు ఎంతగానో ఉపయోగపడతాయి.

 ఫ్రూట్స్ అన్నింటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అందులోనూ బ్లూ బెర్రీల్లో విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. ఫ్లెవనాయిడ్స్ అనే యాంటాక్సిడెంట్లు వీటిల్లో సమ్రుద్ధిగా ఉన్నాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ ని బాగా తగ్గిస్తాయి. బ్లూబెర్రీ పళ్లను అలాగే తినొచ్చు. లేదా సలాడ్లలో వేసుకుని కూడా తినొచ్చు. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

 అవకెడోలు కూడా చర్మ ఆరోగ్యానికి ఎంతో మంచివి.వీటిల్లో ఆరోగ్యవంతమైన ఒమేగా 3 ఫ్యాట్స్ పుష్కలంగా ఉన్నాయి. వీటిల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు బాగా ఉన్నాయి. అంతేకాదు వీటిల్లో మోనోఅన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, యాంటాక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని ఇన్ఫ్లమేషన్ పై పోరాటం చేయడమే కాదు ఆరోగ్యవంతమైన, మ్రుదువైన చర్మాన్ని వ్రుద్ధిచేస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News