- ఉపాధి కోసం పరాయి దేశం వెళ్లి, కూలి నాలి చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ, కంపెనీ పెంచిన పని ఒత్తిడి, చాలీ చాలని జీతంతో మానసిక వేదనకు గురై హై బీపీతో మరణించాడు ఓ తెలంగాణ యువకుడు. గల్ఫ్ దేశంలో కొత్త ధాంరాజ్ పల్లి గ్రామనికి చెందిన సుంకే గణేష్ అర్ధాంతరంగా మరణించటంతో అతని కుటుంబానికి ఇప్పుడు దిక్కు లేకుండా పోయింది.
- వివరాల్లోకి వెళితే మండలంలోని కొత్త ధాంరాజ్ పల్లి గ్రామానికి చెందిన సుంకే గణేష్ (38) ఉపాధి నిమిత్తం గల్ఫ్ కు వెళుతుంటాడు. గత 5 సంవత్సరాల నుండి గల్ఫ్ కు వెళ్తూ వస్తున్నాడు. గత 4 నెలల క్రితం కువైట్ దేశానికి ఉపాధి నిమిత్తం వెళ్ళాడు. అక్కడే పని చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. అతను పనిచేసే కంపెనీలో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. జీతం తగ్గించడం పని గంటలు పెరగటం వల్ల పది రోజుల క్రితం హై బీపీతో అక్కడే కుప్పకూలి పోయాడు. గమనించిన అతని స్నేహితులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నాలుగు రోజుల క్రితం మరణించాడు. గల్ఫ్ లో గణేష్ మరణించిన విషయం పుదారి నిశాంత్ కార్తికేయ తెలుసుకుని…కువైట్ ఎంబసీ ప్రతినిధులతో, గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గుగ్గిళ్ల రవీతో కలిసి బాడీని ఇంటికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గణేష్ కు 10 సంవత్సరాల క్రితం వివాహం జరగ్గా అతనికి భార్య రాజేశ్వరి (33), కుమారుడు రోహన్ రాజు (5), కుమార్తె రిహన్ (3) ఉన్నారు. వీరితో పాటు గణేష్ అమ్మ, నాన్న, అక్కను పోషిస్తున్నాడు. గణేష్ అకాల మరణంతో కుటుంబం వీధిన పడ్డది. ప్రస్తుతం వీరు సర్కారు ఆపన్నహస్తం కోసం వేచి చూస్తున్నారు.
Mallapur: కువైట్లో మరణించిన కొత్త ధాంరాజ్ పల్లి వాసి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES