Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: BSNL ఐపిటివి సేవలు ప్రారంభం

Kurnool: BSNL ఐపిటివి సేవలు ప్రారంభం

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ , సిటీ ఆన్ లైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ (ఉల్కా టీవీ) సౌజన్యంతో సంయుక్తంగా కొత్తగా ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ (ఐపిటివి) సేవలను ప్రారంభించింది. స్థానిక బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ కార్యాలయంలో బిఎస్ఎన్ఎల్ ఐపిటివి సర్వీసులను ఉల్కా టీవీ ప్రతినిధులతో కలిసి కర్నూలు బిజినెస్ ఏరియా జనరల్ మేనేజర్ జి.రమేష్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐపిటివి సర్వీసులు అన్ని గ్రామాలు, పట్టణాలలో ప్రస్తుత ఎఫ్ టి టి హెచ్ వినియోగదారులతోపాటు కొత్తగా కనెక్షన్ తీసుకునే వారికి తమ ఫ్రాంచైజీ (టెలికాం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్)ల ద్వారా జిల్లా వ్యాప్తంగా అందిస్తామన్నారు. ఈ ఐపిటివి సేవల ద్వారా సుమారు 600కు పైగా టీవీ చానల్ లను వ్యాల్యూ ఆడెడ్ సర్వీసులుగా ప్రస్తుతం అందిస్తున్న బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ ఇంటర్నెట్ ద్వారా 30 ఎంబిబిఎస్ నుంచి 300 ఎంబిబిఎస్ వరకు అత్యధిక స్పీడుతో ఇంటర్నెట్ సేవలను, ఇంటికి వైఫై, అపరిమితమైన వాయిస్ కాలింగ్, ఓటిటి లతో కలిపి అందిస్తామని తెలిపారు. ఐపిటివి సేవల ద్వారా బిఎస్ఎన్ఎల్ అందించే టెలికాం సేవల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు.

బిఎస్ఎన్ఎల్ ఐపిటివి సర్వీసు ప్యాకేజీలు…
ఐపిటీవి సర్వీసులు అన్ని ప్రముఖ తెలుగు ఉచితం, పెయిడ్ చానల్స్ ఎస్డి , హెచ్డీ టెక్నాలజీతో వివిధ ప్యాక్ ల రూపంలో లభ్యమవుతుంది.
రూ.130లకు 350 ఫ్రీ చానళ్ళతో ఫ్రీ టు ద ఎయిర్ ప్యాక్
రూ.229 లకు 350 ఫ్రీ చానళ్లు 32 పే చానల్స్ తో ఎస్డి బేసిక్
రూ.259 లకు 350 ఫ్రీ చానళ్లు 52పే చానల్స్ తో ఎస్డి బోనాంజ
రూ.279 లకు 350 ఫ్రీ చానళ్లు,30 పే చానల్స్ తో హెచ్ డి బేసిక్
రూ.329లకు 350 ఫ్రీ చానళ్లు,52 పే చానల్స్ తో హెచ్ డి బోనాంజ
గ్రామీణ ప్రాంతాల్లో కేవలం రూ.399 రూపాయలకే ఇంటర్ నెట్
పట్టణ ప్రాంతాల వారికి రూ. 449 నుండి భారత్ ఫైబర్ ఇంటర్ నెట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇంతే కాకుండా ఆరు నెలలు లేక ఏడాది కాలం బిఎస్ఎన్ఎల్ ఫైబర్ సేవలు రూ.599 కంటే ఎక్కువ ప్లాన్లు తీసుకుంటే రూ.2000 రూపాయలు విలువగల ఫైబర్ మోడెం ఉచితంగా ఇస్తామన్నారు. త్వరలో 4జి సేవలను కూడా బిఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టనుందని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News