Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: నగరంలో అన్న క్యాంటీన్లు

Kurnool: నగరంలో అన్న క్యాంటీన్లు

5 రూపాయలకే కడుపు నిండా..

పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు శనివారం నగరంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కల్లూరు పరిధిలో రెండు అన్న క్యాంటీన్లను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు ప్రత్యేక పూజలు నిర్వహించి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ప్రజలకు అన్నం వడ్డించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.5కే పేదల కడుపు నింపే బృహత్తర కార్యక్రమానికి మళ్ళీ ఎన్డీయే ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించడం జరుగుతుందని, వీటి వల్ల పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగం అన్నారు. నిరుపేదల ఆకలి వైకాపా హయాంలో నిర్ధాక్షిణ్యంగా మూసేసి పేదల కడుపు మాడ్చారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న క్యాంటీన్లు ప్రారంభానికి సంతకం చేశారని పేర్కొన్నారు.

కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక్కొక అన్న క్యాంటీన్‌ను దాదాపు రూ‌.10 లక్షలు వెచ్చించి, నగరంలో 5 అన్న క్యాంటీన్లను ఆధునికీకరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. శనివారం కల్లూరు పరిధిలో పరిమళ నగర్, సెట్కూర్ కార్యాలయం వద్దనున్న రెండు క్యాంటీన్లు ప్రారంభించగా, సోమవారం ఉదయం కలెక్టరేట్ ఆవరణలో, పాతబస్టాండ్ కొండారెడ్డి బురుజు సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్లను మంత్రి టిజి భరత్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.


కార్యక్రమంలో ఆరోగ్యధికారి విశ్వేశ్వర రెడ్డి, ఎస్ఈ వేణుగోపాల్, ఎంఈ శేషసాయి, డిఈ రాజశేఖర్, ఏఈలు దినేష్, ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News