Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Mantralayam: వైభవంగా శ్రీరాఘవేంద్రుల 402 వ పట్టాభిషేక మహోత్సవం

Mantralayam: వైభవంగా శ్రీరాఘవేంద్రుల 402 వ పట్టాభిషేక మహోత్సవం

అంతరించిపోతున్న ఆర్షధర్మం ఈ భువిపై అనంత వాహినిగా కొనసాగాలన్న తపనతో 1628లో సన్యాసం స్వీకరించి మహిమాన్విత గురువై మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి వెలిశారు. తమిళనాట పుట్టి కన్నడనాట చదువుసంధ్యలను నేర్చి తెలుగు నేలపై కాలు మోపిన సమయంలో తుంగా తీరంలో పుడమితల్లి పులకించింది. 70 సంవత్సరాల వయస్సులో మంత్రాలయ పుణ్యభూమిలో సజీవంగా బృందావన ప్రవేశం చేశాడు. అక్కడి నుంచే భక్తి పరిమళాలను విశ్వవ్యాప్తం చేస్తున్న శ్రీరాఘవేంద్ర యతీంద్రులు ఆధునిక మహారుషి, భవిష్య తరాలకు సందేశాన్నిస్తూ సన్మార్గంలో నడుపుతున్న తన అరుదైన దైవం శ్రీరాఘవేంద్ర స్వామి. ఆయన రచించిన 48 గ్రంథాలను ఈసమాజానికి అందజేసిన ఆ మహనీయుని పాదుకా పట్టాభిషేకం శ్రీమఠంలో పీఠాధిపతులు శ్రీసుభుదేంద్రతీర్థుల నేతృత్వంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానయజ్ఞంలో భాగంగా శ్రీమఠం ప్రాకారంలో బెంగుళూరుకు చెందిన విద్వాన్ విజయసింహ్మాచార్ కార్యక్రమం సాగింది. శ్రీమఠం ప్రాంగణంలో కొనసాగిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు కనువిందు చేశాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News