హైదరాబాదు నగరంలోని నార్సింగి లో మాంగళ్య షాపింగ్ మాల్ 21వ స్టోర్ ను సినీ నటి సంయుక్త మీనన్ శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి సంయుక్త మినన్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో అధునాతన కలెక్షన్స్ తో నిత్య నూతన వెరైటీ లతో అతిపెద్ద షాపింగ్ మాల్ గా మాంగళ్య అవతరించిందని అన్నారు. ఈ స్టోర్ ను నార్సింగి లో తను ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు.
అన్ని ట్రెండీ కలెక్షన్స్..
పట్టు, ఫ్యాన్సీ,కంచి,ధర్మవరం, ఉప్పాడ పట్టు చీరలతో పాటు, అధునాతన కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. కిడ్స్, ఎత్నిక్ వెర్ మెన్స్ అండ్ ఉమెన్స్ వివాహాది శుభకార్యములకు ధరించే ప్రత్యేక వస్త్ర ప్రపంచం మాంగళ్య షాపింగ్ మాల్ అని పేర్కొన్నారు. ఈ సందర్బంగా సంయుక్త మీనన్ షాపింగ్ మాల్ లోని పట్టు, ఫాన్సీ సెక్షన్లు ఎత్నిక్ వెర్ లేడీస్ జెంట్స్ కిడ్స్ వెర్ అంతా కలియతిరిగి సందడి చేసారు. ఈ ప్రాంత వాసులు దసరా షాపింగ్ మాంగళ్యలో చేయాలని అన్నారు.
12 ఏళ్లుగా, 21 స్టోర్స్..
షాపింగ్ మాల్ డైరెక్టర్లు పి. ఎన్. మూర్తి, కాసం నమశ్శివాయ, కాసం మల్లికార్జున్, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్ కుమార్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో గత 12 సంవత్సరాలుగా ప్రజల మన్ననలు పొందుతూ ఇప్పటివరకు 21 స్టోర్ లు ప్రారంభించాం అని అన్నారు. ఈ ఆదివారం రోజు హైదరాబాద్ నగరంలో మణికొండ లో ప్రారంభించబోతున్నాం. త్వరలో కర్ణాటక రాష్ట్రంలో కూడా మా స్టోర్లను విస్తరించబోతున్నాం అని చెప్పారు. మా వస్త్రాలను ఎల్లప్పుడూ ఆదరిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.
తక్కువ రేటుకే నాణ్యమైన వస్త్రాలు..
అధునాతన ఫ్యాషన్ డిజైన్లను అందించడానికి ప్రధాన కారణం మా సొంత మగ్గాలపై తయారు చేయడంతో వినియోగదారులకు తక్కువ రేటుకే నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాసం ఫణి, కాసం సాయి కృష్ణ, కాసం ధీరజ్, డాక్టర్ కాసం ప్రీతం, తొడుపునూరి అరుణ్ కుమార్, కార్తీక్, విశాల్, వరుణ్ పాల్గొన్నారు. తొలుత అందాల తార సినీనటి సంయుక్త మీనన్ ను చూడడానికి ఉదయం నుండి అభిమానులు, పరిసర ప్రాంత యువతి, యువకులు బారులు తీరారు. యువతి యువకుల కేరింతలతో షాపింగ్ మాల్ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది. ముందుగా సంయుక్త మీనన్ అభిమానులను చూసి సందడి చేసింది.