Saturday, September 28, 2024
HomeతెలంగాణNirmal: పాఠాలు చెప్పిన కలెక్టరమ్మ

Nirmal: పాఠాలు చెప్పిన కలెక్టరమ్మ

కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి లక్ష్మణచాంద మండల కేంద్రంలోని కేజీబీవీ బాలికల వసతి గృహాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వసతి గృహ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -

వంట గదిని పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాలతో కూడిన భోజనాన్ని అందించాలని, వంటకు నాణ్యమైన వస్తువులు, కూరగాయలను మాత్రమే వినియోగించాలన్నారు. విద్యార్థులకు వండిన ఆహారాన్ని రుచి చూశారు. గణితం సబ్జెక్టును విద్యార్థులకు బోధించి, సబ్జెక్టులో గల మెలకువలను విద్యార్థులకు నేర్పించారు. సౌర కుటుంబం గురించి విద్యార్థులను ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. వంటగది, స్టోర్ రూమ్, మరుగుదొడ్లు, రీడింగ్ రూములు, విద్యార్థుల వసతి గదులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. విద్యార్థులంతా వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. రోజవారి జీవన విధానంలో సరైన సమయ పాలనను పాటించాలన్నారు. జీవితంలో విద్యతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఈఓ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ జానకి, లక్ష్మణచందా ఎంపీడీవో రాధ,ఎంపీఓ అమీర్ ఖాన్, సలోమి కరుణ, ఎఫ్ఏఓ పద్మ, ప్రధానోపాధ్యాయులు నవిత, ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News