దస్ లక్షణ్ పర్వ్ ముగింపు రోజును పురస్కరించుకొని జైనుల ఆరాధ్య దైవం మహావీర్ భగవాన్ ఊరేగింపును గార్ల పట్టణ పురవీధుల్లో జైనులు ఘనంగా నిర్వహించారు. జైన మతస్తులు పది రోజులపాటు ఉపవాస దీక్షలు అవలంబించి జైన మందిరంలో మహావీర్ భగవాన్ కు భక్తి శ్రద్ధలతో అభిషేకాలు శాంతి పూజలు నిర్వహించి దస్ లక్షణ్ పర్వ్ దిన చివరి రోజు మహావీర్ భగవాన్ ను పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ప్రతిష్టించి పూజలు నిర్వహించి జైన మతస్తులు ఏకరూప దుస్తులు ధరించి మేళ తాళాల నడుమ నిర్వహించిన శోభాయాత్రలో భక్తి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ అడుగడుగునా ప్రదర్శనలు నిర్వహించారు.
జియో ఔర్ జీనేదో అహింసా పరమో ధర్మ శాకాహార అప్నావో సుఖ జీవన్ బితావో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గీతాలు ఆలపించి చేసిన ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగావత్ లక్ష్మణ్ నాయక్ జైన మతస్తులు మహేందర్ జైన్ విమల్ జైన్ విపుల్ జైన్ విశాల్ జైన్ మహావీర్ జైన్ నితిన్ జైన్ సంజిల్ జైన్ మహావీర్ జైన్ ప్రవీణ్ జైన్ ఆకాష్ జైన్ గోపాల్ జైన్ గౌరవ్ జైన్ దిలీప్ జైన్ విజయ్ జైన్ కిషోర్ జైన్ సుభాష్ జైన్ మహిళలు యువతి యువకులు చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.