Saturday, October 5, 2024
HomeతెలంగాణPatancheru: ఉర్సు ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక

Patancheru: ఉర్సు ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక

పటాన్ చెరు పట్టణ పరిధిలోని హజ్రత్ సయ్యద్ మురాధ్ అలీ షా దర్గా ఉర్సు ఉత్సవాల్లో పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. హిందూ, ముస్లిం తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉర్సు ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. ఉర్సు ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. అనంతరం దర్గా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జీఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉర్సు నిర్వాహకులు, మైనార్టీ మత పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News