రామ్ చరణ్ గొప్ప డాన్సర్, పెర్ఫామర్.. ‘గేమ్ చేంజర్’లో ఆయన్ని సరికొత్తగా డిఫరెంట్ డైమన్షన్‌లో చూస్తారు: ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్ శంకర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘రా మచ్చా మచ్చా..’ సాంగ్‌ను సెయింట్ మార్టిన్స్ కాలేజ్‌లో స్టూడెంట్స్ సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా..
చిత్ర నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘‘గేమ్ చేంజర్’ ప్రమోషన్స్ ఈ కాలేజ్ నుంచే స్టార్ట్ చేశాం. జెంటిల్‌మేన్ నుంచి శంకర్‌గారు డైరెక్ట్ చేసిన అన్నీ సినిమాలు నాకు ఇష్టమే. ప్రతీ సాంగ్‌ను ఆయన ఎంతో స్పెషల్‌గా తెరకెక్కిస్తుంటారు. ‘గేమ్ చేంజర్’లోనూ ఐదు పాటలను ఐదు రకాలుగా విజువలైజేషన్ చేశారు. మరో మూడు అద్భుతమైన పాటలు రానుంది. ట్రిపులార్ తర్వాత రామ్ చరణ్ చేసిన ‘గేమ్ చేంజర్’ను క్రిస్మస్ సందర్భంగా విడుదల చేస్తున్నాం’’ అన్నారు.
స్టార్ డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ ‘‘నేను డైరెక్ట్ చేసిన ప్రతీ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. అలాంటి ప్రేక్షకుల కోసం ఓ స్ట్రయిట్ మూవీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు ‘గేమ్ చేంజర్’ రూపంలో అది నేరవేరుతుంది. దిల్‌రాజు, శిరీష్‌గారి నిర్మాతలుగా ఈ మూవీ తెరకెక్కుతుంది. పక్కా తెలుగు సినిమాలా ప్రతి విషయంలో కేర్ తీసుకుని ఎంతో జాగ్రత్తగా దీన్ని తెరకెక్కించాను. సాంగ్స్ విషయానికి వస్తే నేను హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఏ సినిమాలోనూ చేయలేదు. కానీ తొలిసారి ‘గేమ్ చేంజర్’లో అలాంటి హీరో ఇంట్రోసాంగ్ చేశాను. తెలుగు సంస్కృతిని చూపించటానికి 1000 మంది జానపద కళకారులతో పాటను చిత్రీకరించాం. తమన్‌గారు రెండు రోజులు అన్నీ ట్యూన్స్‌ను రికార్డ్ చేసి ఈ పాటను తమన్‌గారు చేయటం విశేషం. రామ్ చరణ్గారిని సరికొత్తగా డిఫరెంట్ డైమన్షన్స్‌లో చూడొచ్చు. ఆయన మంచి డాన్సర్. పెర్ఫామర్. ఆ సాంగ్‌లో అద్భుతంగా డాన్స్ చేశారు. ఈ సాంగ్‌లో ఒక నిమిషం పాటు వచ్చే బీజీఎంను ఆయన సింగిల్ టేక్ డాన్స్‌తో పూర్తి చేశారు. మేకర్స్ అన్కాంప్రమైజ్డ్గా సినిమాను నిర్మించారు. దిల్‌రాజు, శిరీష్‌గారికి స్పెషల్ థాంక్స్. శ్రీకాంత్‌గారు ఫస్ట్ టైమ్ ఓ డిఫరెంట్ రోల్లో కనిపిస్తారు. ఎస్.జె.సూర్య నట రాక్షసుడు. చరణ్, సూర్య మధ్య సన్నివేశాలను ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు. అనంత్ శ్రీరామ్‌గారు పాటను అద్భుతంగా రాశారు. ఈ పాటను రేపు స్క్రీన్‌పై చూస్తున్నప్పుడు నోస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది’’ అన్నారు.
ఎస్.జె.సూర్య మాట్లాడుతూ ‘‘‘గేమ్ చేంజర్’ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించబోతున్నాను. చరణ్‌గారితో శంకర్‌గారి డైరెక్షన్లో, దిల్‌రాజుగారి ప్రొడక్షన్లో యాక్ట్ చేయటం అనేది గొప్ప బహుమతిగా భావిస్తున్నాను. తమన్‌గారి మ్యూజిక్‌లో ఔట్పుట్ అదిరింది. ఓ ఫుల్ మీల్స్‌లాంటి సినిమా. మూవీ చాలా బాగా వచ్చింది. ఇందులో నేను మోపిదేవి అనే పాత్రలో మిమ్మల్ని మెప్పిస్తాను. సినిమాలో డెఫనెట్‌గా ఫెంటాస్టిక్ డ్రామా, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్, యాక్షన్ అన్నీ ఉంటాయి. రేపు సినిమానే మాట్లాడుతుంది. త్వరలోనే మూవీ మీ ముందుకు వస్తుంది’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ మాట్లాడుతూ ‘‘ఇరవై ఏళ్ల క్రితం శంకర్‌గారి దర్శకత్వంలో బాయ్స్ అనే సినిమా చేశాను. అప్పుడు నా దగ్గరుండే చిన్న కీ బోర్డ్‌తో ఆయనకొక ట్యూన్ వినిపించాను. తర్వాత ఆయన ప్రొడక్షన్లో తెరకెక్కిన వైశాలి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా మారాను. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న ‘గేమ్ చేంజర్’ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాను. జరగండి సాంగ్ తర్వాత రా మచ్చా మచ్చా.. సాంగ్‌ను అందరికీ అందిస్తున్నాం. త్వరలోనే మళ్లీ అందరినీ కలుద్దాం. అనంత శ్రీరామ్‌గారు పాటను అద్భుతంగా రాశారు. దిల్‌రాజుగారితో వకీల్ సాబ్ తర్వాత ‘గేమ్ చేంజర్’ మూవీ చేయటం మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్’’ అన్నారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘‘గేమ్ చేంజర్’లో సెకండ్ సాంగ్‌గా ‘రా మచ్చా మచ్చా రా..’ను స్టూడెంట్స్ మధ్య రిలీజ్ చేయటం అనేది ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధిస్తుంది. రామ్ చరణ్ నాకు కొడుకుతో సమానం. అన్నయ్య కొడుకుగా తనంటే ఎప్పటికీ నాకు ప్రత్యేకమైన అభిమానమే. గోవిందుడు అందరివాడేలే తర్వాత చరణ్‌తో చేస్తోన్న రెండో సినిమా ఇది. రాజుగారి బ్యానర్లో రెండో సినిమా ఇది. తమన్‌గారి సంగీతంలో చాలా సినిమాలు యాక్ట్ చేశాను. శంకర్‌గారి డైరెక్షన్లో యాక్ట్ చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఆ కోరిక ‘గేమ్ చేంజర్’ ద్వారా నేరవేరింది. చాలా మంచి క్యారెక్టర్‌ను ఇందులో ఇచ్చారు. నా పాత్రను ఓ చాలెంజింగ్‌గా తీసుకుని చేశాను. సూర్యగారు గొప్ప డైరెక్టరే కాదు, గొప్ప ఆర్టిస్ట్. ‘గేమ్ చేంజర్’ మూవీ పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు.
అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ ‘‘మా విజయయాత్రలో మొదటి అడుగు సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచే ప్రారంభమైంది. విజయంతో పాటు పురస్కారాలు కూడా అందుకునే చిత్రంగా ‘గేమ్ చేంజర్’ ఉంటుందని ఈ కాలేజ్ ద్వారా నిరూపిత మవుతుంది. ఈ పాటలో రా మచ్చా మచ్చారా.. అనే లైన్ ఇచ్చిన క్రెడిట్ మాత్రం డైరెక్టర్ శంకర్‌కి మాత్రమే దక్కుతుంది. పాటలో అన్నీ లైన్స్ రామ్ చరణ్‌గారి గురించి ఉంటే ఓ లైన్ మాత్రం చిరంజీవిగారి గురించి ఉంటుంది. ఇంత మంచి పాట రాసే అవకాశం నాకు ఇచ్చిన శంకర్‌గారికి, తమన్‌గారికి, దిల్‌రాజుగారికి థాంక్స్’’ అన్నారు.