Wednesday, October 2, 2024
HomeతెలంగాణKarepalli: సమయపాలన పాటించని కార్యదర్శులు

Karepalli: సమయపాలన పాటించని కార్యదర్శులు

బదిలీలతో సతమతం

మండల పరిధిలోని 41 గ్రామపంచాయతీ కార్యదర్శులు ఇటీవల బదిలీపై వెళ్లగా నూతన వచ్చిన కార్యదర్శులు ఒంటిగంట ఇంటి బాట పడుతున్నారని విమర్శలు వెలుగుతున్నాయి. ప్రభుత్వం మారి ప్రత్యేక పాలన వచ్చిన వచ్చిన కార్యదర్శులు తీరు మాత్రం మారడం లేదని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ పనులు జరగడం లేదని గ్రామంలో ఎక్కడి చేత కుప్పలు అక్కడే ఉంటున్నాయని ట్రాక్టర్ తిరగక సుమారు మూడు నెలలు అవుతుందని గ్రామస్తులు తన ఆవేదనవెల్లుపుచ్చుకుంటున్నారు. ఇటీవల వర్షాలు కురిసిన గ్రామాలలో కనీసానికి బ్లీచింగ్ కూడా చల్లలేదని ఎంత చెప్పినా నూతన కార్యదర్శులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామాలలో పారిశుద్ధ్య లోపం కారణంగానే విష జ్వరాలు వచ్చి ప్రజలంతా మంచాన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మారుమూల ప్రాంతంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైందని స్పష్టంగా తెలుస్తుంది దీనికి నిదర్శనం మండలానికి జైత్రం తండా, కారేపల్లికి దగ్గరలో ఉన్న వెంకటయ్య తండా గ్రామాలలో విధి నిర్వహణలో ఉన్న కార్యదర్శులు ఉదయాన్నే వచ్చి ఒంటి పూటకి ఇంటి బాట పడుతున్నారని ప్రజలకు అందుబాటులో ఉండడం గ్రామస్తులు తెలుపుతున్నారు.

- Advertisement -

ఎప్పుడు చూసినా పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి ఉంటుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఏ పనికి వెళ్ళిన అందుబాటులో ఉండడం లేదని ఇప్పుడు చూసిన ఆఫీసులో ఉన్నామని ఆఫీస్ కి వెళ్లిన కార్యదర్శి తిరిగి పంచాయతీకి కార్యాలయానికి రావడంలేదని గ్రామస్తులు తెలుపుతున్నారు.ఇప్పటికైనా ఉన్నత అధికారులు నారుమూల ప్రాంతం పై దృష్టి పెట్టాలని కార్యదర్శులు సమయపాలన పాటించే విధంగా చూడాలని మండల ఎం.పీ.డీ.వో ను, ఎం.పీ.ఓ ను వేడుకున్నారు.

ఈ క్రమంలో కొందరి కార్యదర్శులను ఎందుకు ఆలస్యంగా వస్తున్నారు.తొందరగా వెళ్ళిపోతున్నారు అని అడగగా బదిలీలతో సతమతమవుతున్నామని. సుమారు 160 కిలోమీటర్లు దూరంగా ఉన్న కారేపల్లి మండలానికి బదిలీ చేయడంతో అప్ అండ్ డౌన్ చేస్తున్నామని తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులు మాత్రం కార్యదర్శులు గ్రామాలలోని ఉండాలని ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలుపుతున్న వారి ఆదేశాలు మాత్రం బేకాతార్ చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News