Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్APSFL: ఏపీ ఫైబర్ నెట్ బేసిక్ ప్లాన్ ధరలు పెంచట్లేదు

APSFL: ఏపీ ఫైబర్ నెట్ బేసిక్ ప్లాన్ ధరలు పెంచట్లేదు

ఏపీ ఫైబర్ నెట్ బేసిక్ ప్లాన్ ధరలు పెంచుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని APSFL ఛైర్మన్ డా.పి.గౌతంరెడ్డి ఖండించారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, 3వ అంతస్తులోని ఫైబర్ నెట్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి బేసిక్ ప్లాన్ ధరలు పెంచే ఆలోచన లేదన్నారు. ప్రస్తుతం ఏపీ ఫైబర్ నెట్ ద్వారా రూ.190 లకే ఇంటర్నెట్ సేవలందిస్తున్నామన్నారు.

- Advertisement -

త్వరలో విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి ప్రాంతాల్లో ఏపీ ఫైబర్ నెట్ బాక్సుల సర్వీస్ సెంట్లర్లను ఏర్పాటు చేయబోతున్నట్టు గౌతంరెడ్డి ప్రకటించారు. మారుమూప్రాంతాలకు సైతం అత్యధిక స్పీడ్ తో ఇంటర్నెట్ సేవలు తాము అందిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. జగనన్న కాలనీలు, టిడ్కో గృహాల్లో కూడా ఏపీ ఫైబర్ నెట్ వాడేలా కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఈ కాలనీల్లో ఏపీ ఫైబర్ నెట్ ను తొలగించి బయటి నెట్ వర్క్ లను వినియోగిస్తే ఏపీఎస్ఎఫ్‌ఎల్ ఆధ్వర్యంలో చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల జగనన్న కాలనీలు, టిడ్కో గృహాల్లో ఏపీ ఫైబర్ నెట్ వినియోగం జరిగేలా కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఏపీ ఫైబర్ నెట్ 15 లక్షల కనెక్షన్ల నెట్ వర్క్ అని ప్రస్తుతం 6 లక్షల కనెక్షన్లుకు పైగా సేవలు అందిస్తోందని ఉందని గౌతంరెడ్డి తెలిపారు. 55 వేల కిలోమీటర్ల వరకు ఏపీ ఫైబర్ నెట్ విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు, ప్రస్తుతం 33 వేల కిలోమీటర్లలో పనులు జరుగుతున్నాయని, అలాగే 27 వేల కిలోమీటర్లలో ఏపీ ఫైబర్ నెట్ ట్రెండింగ్ లో ఉందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News