Friday, November 22, 2024
HomeదైవంJagityala: త్రిశక్తి మాత ఆలయంలో దుర్గామాత దీక్షలు

Jagityala: త్రిశక్తి మాత ఆలయంలో దుర్గామాత దీక్షలు

అమ్మవారికి భక్తిపూర్వకంగా..

కొలిచిన వారికి కొంగు బంగారంగా గణేష్ నవదుర్గమండలి ఆద్వర్యంలో త్రిశక్తి మాత ఆలయంలో నవరాత్రోత్సవాల కోసం ఆలయ అర్చకులు పాలేపు శివ కుమార్ నిర్వహణలో 250, పైనే దుర్గామాత దీక్షలు గురువారం చేపట్టారు. పిల్లల నుండి, వృద్దుల వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో తొమ్మిది రోజుల పాటు దీక్షలో ఉంటారు.

- Advertisement -

47 ఏళ్లుగా..
కోరుట్ల పట్టణం లో గణేష్ నవదుర్గమండలి ఆద్వర్యంలో “త్రిశక్తి మాత” ఆలయం ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఆలయంగా చెప్పుకుంటారు. సుమారు 47, సంవత్సరాలుగా ఇక్కడ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున దీక్షలు తీసుకుంటారు. ఇక్కడి అమ్మవారిని దర్శించుకునేందుకు నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాదు, కరీంనగర్ తోపాటు వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. దుర్గామాత నవరాత్రుల ఉత్సవాలు ఈ ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున దుర్గామాత దీక్షలు తీసుకోవడం ఇక్కడి విశిష్టత అని అర్చకులు తెలిపారు.

9 రోజులు నిష్టగా..
తొమ్మిది రోజుల పాటు నియమ నిష్ఠలతో అమ్మవారిని కొలిచి, అనంతరం పదవరోజు దీక్ష విరమణ చేస్తారు. గణేష్ నవదుర్గ మండలి ఆధ్వర్యం లో త్రిశక్తి మాతా దేవాలయం లో ఇక్కడ నిత్యం పూజలు ఘనంగా నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో గణేష్ నవదుర్గ మండలి అధ్యక్షులు కటుకం గణేష్, ప్రధాన కార్యదర్శి గజ్జల శంకర్, కోశాధికారి ఆడువాల ప్రభాకర్, 11వ వార్డు కౌన్సిలర్ దాసరి సునిత, పాత్రికేయులు గంగుల రాంగోపాల్, ముక్కెర చంద్రశేఖర్, త్రిశక్తి మాత సభ్యులు కస్తూరి రాజేశ్వర్, కటుకం గంగారాం, సంకు అశోక్, గాజుల రమేష్, వెంకటేశం, కస్తూరి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News