Thursday, October 3, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: ఘనంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కార్యక్రమం

Emmiganuru: ఘనంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కార్యక్రమం

గ్రామాల నుంచే అభివృద్ధి ..

గ్రామాల నుంచి అభివృద్ధి ప్రారంభం కావాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మహబూబ్ నగర్ అన్నారు. పట్టణంలోని స్థానిక శ్రీ మహాయోగి లక్ష్మమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల అధ్యక్షులు డాక్టర్ కే మెహబూబ్ భాష అధ్యక్షతన చరిత్ర అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ హెచ్ కిరణ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా కళాశాల అధ్యక్షులు డాక్టర్ కే మెహబూబ్ భాష మాట్లాడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 సాధన మన చేతుల్లోనే ఉన్నదని, దానికోసం చేయవలసిన స్వయంకృషి ద్వారానే జరగాలని తెలిపారు. అనంతరం వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ అభివృద్ధి అనేది తమ గ్రామాల నుండే జరగాలన్నారు. కళాశాల ఐక్యూఎస్సి కోఆర్డినేటర్ డాక్టర్ ఎం సుశీలమ్మ మాట్లాడుతూ విద్యార్థులు తమను తాము అభివృద్ధి పరుచుకుంటూ దేశ అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. చరిత్ర అధ్యాపకులు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ హెచ్ కిరణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కళాశాల తరఫున నిర్వహించిన వ్యాస రూప పోటీలలో స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 సాధించుటకు సలహాలు, సూచనలు అనే అంశంపై పాల్గొన్న విద్యార్థులను అభినందించారు.

- Advertisement -

కళాశాల అధ్యక్షులు, అధ్యాపకుల చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు . ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సీబీ లక్ష్మన్న, కె . తిరుపతి రెడ్డి, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News