Friday, November 22, 2024
HomeఆటCM Revanth releases CM cup logo: సీఎం కప్​ 2024 మస్కట్,...

CM Revanth releases CM cup logo: సీఎం కప్​ 2024 మస్కట్, లోగో, పోస్టర్ల విడుదల చేసిన సీఎం రేవంత్

క్రీడా రాజధానిగా..

తెలంగాణ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ ప్రకటించారు. 25 ఏళ్ల క్రితం కామన్వెల్త్  , ఆఫ్రో ఏషియన్ గేమ్స్  నిర్వహించి హైదరాబాద్  క్రీడలకు తలమానికంగా నిలబడిందని గుర్తు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ..తెలంగాణ వచ్చిన పదేళ్లలో రాష్ట్రంలో క్రీడలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.

- Advertisement -

హైదరాబాద్ నగర యువత క్రీడల వైపు వెళ్లకుండా  వ్యసనాలకు బానిసలు అవుతున్నారు.. ఇది బాధ కల్గిస్తోందన్న సీఎం, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే క్రీడలకు వేదికగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నట్టు వివరించారు.

నిఖత్ జరీన్ మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఇండియా కు బాక్సింగ్ లో తలమానికంగా మారారని, నిఖత్ జరీన్ కు డీఎస్సీ ఉద్యోగం ఇచ్చామన్నారు. తెలంగాణలో క్రీడల్లో రాణిస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందనడానికి నిఖత్ జరీన్ నిదర్శనమని, నిబంధనలు సడలించి  మహ్మద్   సిరాజ్ కు డీఎస్సీ ఉద్యోగం ఇచ్చామన్నారు. పీవీ సింధు, అజారుద్దీన్ లాంటి హైదరాబాదీలు దేశానికే పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టారన్నారు.

పుట్ బాల్ కోచ్ రహీమ్ సార్ హైదరాబాద్ నగరానికి చెందిన వారు కావడం గర్వకారణమని, హైదరాబాద్ నగరం క్రీడలకు వేదిక కావాలని అండర్ 17 పుట్ బాల్ నేషనల్ టీం ను తెలంగాణ దత్తత తీసుకుంటోందన్నారు.  చిన్న దేశం దక్షిణ కొరియాలో ఒలంపిక్స్ లో  36 పతకాలు సాధించిందని, తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించడం కోసం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. యంగ్ ఇండియా కోచింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తామని, దక్షిణ కొరియా కోచ్ లను ఇక్కడికి రప్పించి శిక్షణ ఇస్తామన్నారు.  మతాలకు అతీతంగా అందరూ కలిసేది క్రీడా మైదానంలోనేనన్న సీఎం దేశ ప్రతిష్ఠను పెంచేది క్రీడా మైదానాలేనన్నారు.

ఎల్బీ స్టేడియాన్ని అద్భుతమైన స్టేడియంగా తీర్చిదిద్దుతామని, యువత వ్యసనాల వైపు వెళ్లొద్దు.. క్రీడల్లో రాణిస్తే దేశ ప్రతిష్టను ప్రపంచంలోనే పెంపొందించే అవకాశం ఉంటుందన్నారు. 2028  ఒలింపిక్స్ లో దేశం తరుపున తెలంగాణ క్రీడాకారులు గోల్డ్ మెడల్స్  తీసుకురావాలని, రాష్ట్ర క్రీడాకారులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు సీఎం. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన నేను అత్యంత పెద్ద లోక్ సభ నియోజకవర్గం మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా విజయం సాధించి,2018 న ఎమ్మెల్యేగా ఓడిపోయిన నేను 2023న తెలంగాణ కు ముఖ్యమంత్రి అయ్యానన్నారు. తెలంగాణకు సీఎం కావాలని నేను లక్ష్యం పెట్టుకున్న.. సాధించినట్టు ఆయన వెల్లడించారు. లక్ష్యాన్ని పెట్టుకొని కష్టపడి పనిచేస్తే సాధించలేనిది లేదన్న సీఎం క్రీడాకారులకు పూర్తి సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News