Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Diversity in languages: భాషా వైవిధ్యమే బలం

Diversity in languages: భాషా వైవిధ్యమే బలం

ఫిబ్రవరి 21వ తేదీని 2000 నుంచి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా పరిగణించడం జరుగుతోం ది. వాస్తవానికి 1999లోనే యునెస్కో ఈ రోజును ఒక ప్రత్యేక దినోత్సవంగా గుర్తించడం ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా భాషా, సాంస్కృతిక వైవిధ్యాన్ని, బహుభాషాపరత్వాన్ని ఇతోధికంగా ప్రోత్సహించాలని రోజున కంకణం కట్టుకుంది. యునెస్కో ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి కారణముంది. మాతృభాష అయి కోసం 1952లో తూర్పు పాకిస్థాన్‌ (బంగ్లాదేశ్‌)లో చాలా మంది ఆత్మాహుతికి పాల్పడ్డారు. జాతీయ భాష అయిన ఉర్దూతో పాటు తమ మాతృభాష బంగ్లాకు కూడా సరైన హెూదా, స్థాయి ఇవ్వాలని కోరుతూ అప్పట్లో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి ప్రాణత్యాగాలు చేశారు. దానికి గుర్తుగా యు నెస్కో ఆ రోజును అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా గుర్తించింది.
ఆందోళనకారుల మీద పోలీసులు కాల్పులు జరపడంతో వందలాది మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్లో అశాంతి ప్రబలింది. ఈ ఆందోళన దాదాపు నాలుగేళ్ల పార్టీ కొనసాగింది. దాం తో పాకిస్థాన్‌ ప్రభుత్వం దిగివచ్చి, ఉర్దూతో పాటు బంగ్లాను కూడా అధికార భాషగా గుర్తించింది. అయితే, పాకిస్థాన్‌ ప్రభుత్వం బంగ్లాను నిర్లక్ష్యం చేస్తూ, ఉర్దూ భాషను ప్రోత్సహించడాన్ని మానుకోలేదు. బంగ్లా భా షకు చెందిన ప్రజలు ప్రభుత్వ కుట్రను గుర్తించి, మళ్లీ ఆందోళనకు దిగారు. చివరికి ఈ ఆందోళన ’ప్రత్యే క బంగ్లాదేశ్‌’ విమోచన ఉద్యమంగా పరిణామం చెందింది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ ప్రత్యేక దేశంగా ఏర్పడ డం జరిగింది. భాషా వైవిధ్యాన్ని నిర్లక్ష్యం చేయడం, ఒక దేశం ఒక భాష అనే విధానాన్ని అనుసరించడం ఇందుకు ప్రధాన కారణం. ఇదే కారణంగా మరొక దేశంలో కూడా అశాంతి, అసంతృప్తి చెలరేగాయి. శ్రీల ంకలో సింహళ భాష మాత్రమే అధికార భాషగా చాలా కాలం కొనసాగింది. అయితే, 30 శాతం జనాభా కలిగిన తమిళ భాషను నిర్లక్ష్యం చేయడాన్ని సహించలేని, భరించలేని తమిళులు దాదాపు మూడు దశాబ్దాల పాటు అక్కడ ఆందోళన నిర్వహించడం జరిగింది.
దీనిని భారతదేశ పరిస్థితులతో కూడా పోల్చి చూసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో కూడా భాషా వైవిధ్యం ఉంది. బహుభాషాపరత్వం ఉంది. అదే సమయంలో కొన్ని భాషల పట్ల నిర్లక్ష్యం లేదా చులకన భావం కూడా ఉంది. 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఎనిమిదవ షెడ్యూ ల్లో 14 భాషలకు స్థానం కల్పించారు. వీటన్నిటికీ అధికార హెూదా కల్పించారు కానీ, ఒక్క భాషకు కూడా జాతీయ భాష అనే హెూదాను కట్టబెట్టలేదు. కాగా, భాషల మధ్య సమన్వయం సాధించడానికి, ప్రతి భాషకూ ప్రాధాన్యం ఇవ్వడానికి నాలుగేళ్ల తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ ఏర్పడింది. దేశ భాషల కార్య కలాపాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడానికి ఈ అకాడమీ ఎంతగానో కృషి చేసింది. బహుభాషాప రత్వం అనేది భారతదేశ బలం, భాషా వైవిధ్యం ఇందుకు మరింత ఊతమిస్తోంది. దేశ ఐక్యతకు, భాషా సారూప్యతకు ఎటువంటి సంబంధమూ లేదు.
రాజ్యాంగ స్ఫూర్తిని గానీ, ఇటీవలి కాలంలో చరిత్ర నేర్పిన పాఠాలను కానీ పాలకులు పట్టించుకుంటు న్నట్టు కనిపించడం లేదు. ఒక భాషను దేశం తల మీద రుద్దడానికి, ఇతర భాషలను బలహీనం చేయడాని కి చాప కింద నీరులా కుట్ర జరుగుతున్నట్టు సందేహం కలుగుతోంది. దేశంలోని అపురూప, అపూర్వ భా షా వైవిధ్యాన్ని తుంగలో తొక్కడానికి పాలకులు అడపాదడపా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రయత్నాలు సాగిస్తున్నట్టు విశదమవుతూనే ఉంది. పది వేల మంది కూడా మాట్లాడని భాషను పక్కన పెట్టడం అనేది క్ర మంగా ఒక విధానంగా మారుతోంది. 1971 జనాభా లెక్కల ప్రకారం, పది వేల మంది కంటే తక్కువగా మాట్లాడేవారున్నప్పుడు వారిని ’ఇతరులు’గా పరిగణించాల్సి ఉంటుంది. ప్రభుత్వ విధానం ఏ విధంగా మా ర్పు చెందబోతోందో ఈ ధోరణి చెప్పకనే చెబుతోంది. దేశవ్యాప్తంగా సుమారు 50 భాషలకు ఇది ఒక శాపంగా పరిణమించబోతోంది. కొన్ని భాషల వారి జనాభా తగ్గుతున్నట్టు చూపిస్తూనే హిందీ భాష వారి సంఖ్య పెరుగుతున్నట్టు చూపడాన్ని బట్టి హిందీయేతర భాషల పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నదీ అర్థం చేసుకోవచ్చు. హిందీ భాషకు జాతీయ భాష హెూదాను కట్టబెట్టడం కోసం అంతర్లీనంగా ప్రయత్నం జరుగుతోందని కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
ఇందులో భాగంగా మరొక కుట్ర కూడా జరుగుతోంది. జనాభా లెక్కల సేకరణలో, మాతృభాషకు, భాష కు మధ్య తేడాను సృష్టించే ప్రయత్నం కూడా జరుగుతోంది. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం, దేశం లో 121 భాషలు, 270 మాతృభాషలు ఉన్నాయి. సుమారు వందేళ్ల క్రితం 179 భాషలుండేవి. 540కి పై మాతృభాషలుండేవి. ఇటీవల జరిపిన సర్వేలో కూడా దేశంలో అన్ని రకాల భాషలూ కలిపి 780 భాష లున్నట్టు నమోదయింది. మొత్తం మీద ఈ విధంగా భాషా వైవిధ్యాన్ని పట్టించుకోకపోవడం అన్నది విద్యా రంగం మీద కూడా ప్రభావం చూపిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 350ఎ విద్యార్థులకు మాతృభాషలోనే విద్యాబోధన జరపాలని చెబుతున్నప్పటికీ, వాస్తవంలో ఆ విధంగా జరగడం లేదు. ఒకే ఒక భాషలో విద్యాబోధన జరపడానికి కృషి జరుగుతున్న విషయాన్ని ఇటీవలి ప్రభుత్వ విధానాలు నిర్ధారిస్తున్నాయి. మా తృభాషలో విద్యాబోధన జరపడం వల్ల సామాజిక అసమానతలు తొలగడానికి, అందరికీ విద్య అందడానికి అవకాశం కలుగుతుంది. అయితే, ఇక్కడ కూడా ఇతర జనాకర్షక పథకాల మాదిరిగా ఇంగ్లీషు కోసం పో టీ ప్రారంభమై, మాతృభాషలను నిర్లక్ష్యం చేయడం జరుగుతోంది.
వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే యునెస్కో ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రారంభించింది. సృజనాత్మకత పెరగాలన్నా, విమర్శనాత్మక ఆలోచనా ధోరణి పెంపొందాలన్నా తప్పనిసరిగా మాతృభాషలో నే విద్యను బోధించాలని, మాతృభాషకే ప్రోత్సాహమివ్వాలని యునెస్కో భావిస్తోంది. మాతృభాషలో లేదా సొ ంత భాషలో విద్యను బోధించడమే సరైన విద్యాబోధన అవుతుందని కూడా అది స్పష్టం చేసింది. రాజకీయ ప్రయోజనాలకన్నా సామాజిక ప్రయోజనాలు ముఖ్యమనీ, మాతృభాషలో బోధించినప్పుడే విద్యా బోధన కొ త్త పుంతలు తొక్కగలుగుతుందని అది తేల్చి చెప్పింది. ఇటువంటి సమయంలో ఒకే భాషను జనం తలలపై రుద్దే ప్రయత్నం చేయకుండా, ఒకే భాషకు అధికార భాష హెూదా కట్టబెట్టకుండా, మాతృభాషను అన్ని కోణాల నుంచి అభివృద్ధి చేయడాన్నే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ పరమార్థంగా గుర్తించాలని అది సూచించింది.
– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News