Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Election budget: ఎన్నికల్లో బడ్జెట్‌ ఓ అస్త్రం అవుతుందా?

Election budget: ఎన్నికల్లో బడ్జెట్‌ ఓ అస్త్రం అవుతుందా?

ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్న తొమ్మిది రాష్ట్రాలలో ఓటర్లు ఈ తాజా బడ్జెట్‌కు ఆమో ద ముద్ర వేస్తా రా? ఎన్నికల మీద ఈ బడ్జెట్‌ ప్రభావం ఎలా ఉండబోతోంది? ఒకటి రెండు నెలల్లో ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది కానీ, ఓటర్ల మీద దీని ప్రభావం ఉంటుందా, ఉండదా అన్న చర్చను మాత్రం ఇది రేకెత్తి స్తోంది. పార్లమెంట్‌లో గత ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్పించిన బడ్జెట్‌ రాజకీయ ఆకాంక్షలకు, ఆర్థిక వాస్తవాలకు మధ్య సమతూకాన్ని సాధించడానికి ప్రయత్నించిందనడంలో సందేహం లేదు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఈ రెండవ హయాంలో ఇది దాదాపు చివరి బడ్జెట్‌. 2024 మే నెలలో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌కు ఎంతో ప్రాధాన్యం పెరిగింది. నిజానికి ఇది రాజ కీయంగా కూడా ప్రాధాన్యం ఉన్న బడ్జెట్‌. 2024లో జరగ బోయే లోక్‌ సభ ఎన్నికల కన్నా రెండు మూడు నెలలో తొమ్మిది రాష్ట్రాల శాసనసభలకు జరగబోయే ఎన్నికలు మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. తాజా బడ్జెట్‌ ప్రభావం ముందుగా ఈ శాసనసభ ఎన్నికల మీదే పడే అవకాశం ఉంది.
ఈ ఏడాది మే నెల లోగా మేఘాలయ, త్రిపుర, నాగా లాండ్‌, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. నిజానికి, ఇటీవల నిర్మలా సీ తారామన్‌ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ దేశ ఆర్థిక వ్యవస్థలోనో, సామా జికంగానో, సమస్యల పరిష్కారంలోనో సమూలంగా మార్పులు చేసి, విప్లవాలు సృష్టించే బడ్జెట్‌ ఏమీ కాదు. ఇది ఆర్థిక వ్యవస్థ సజావుగా ముందుకు సాగడానికి ఉద్దేశించిన బడ్జెట్‌ మాత్రమే. ఆర్థిక క్రమశిక్షణ మాత్రమే లక్ష్యం. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ జనాకర్షక బడ్జెట్‌గ పరిగణిం చడం కుదరదు. ఇక బడ్జెట్లో మూలధన వ్యయాన్ని 33 శాతం పెంచడం జరిగింది. గతంలో 75 లక్షల కోట్ల రూపాయలున్న మూలధన వ్యయాన్ని ఈ బడ్జెట్‌లో కోటి ఈ లక్షల కోట్ల రూపాయలకు పెంచారు. కోవిడ్‌ ఫలి తంగా దారుణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరి ంచడానికి, పెద్ద ఎత్తున ఉద్యోగాలను సృష్టించడానికి ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్‌.డి.ఏ ప్రభుత్వం దాదాపు ప్రతి బడ్జెట్‌ లోనూ మూలధన వ్యయాన్ని పెంచుతూ పోతోంది.
‘అమృత్‌ కాల్‌’లో ఇది మొదటి బడ్జెట్‌ అని నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బడ్జెట్‌ను సమర్పిస్తూ అభివర్ణిం చారు. 2021లో ప్రధాని నరేంద్ర మోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో 2022-2047 మధ్య ఉన్న 25 ఏళ్ల కాలాన్ని అమృత్‌ కాల్గా పేర్కొన్నారు. ఆ మాటనే ఆమె తన బడ్జెట్కు ఉపయోగించు కున్నారు. 2047లో భారత దేశం స్వాతంత్య్ర దినోత్సవ శత వార్షికోత్సవాలను జరుపుకుం టుంది. కూ ఆమె ఆ మాట అనగానే, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అందుకు సమాధానంగా ఈ కాలాన్ని ‘మిత్ర కాల్‌’గా అభివర్ణించారు. మోదీ తనకు అత్యంత సన్నిహితులైన ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ ఆ దానీ వంటి సంపన్న పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే పని చేస్తుంటారని ఆయన తరచూ అంటుంటారు. ఆ మాటనే ఈసారి ఇలా ఉపయోగించుకున్నారు. కాగా, లోక్‌ సభ ఎన్నికలు జరిగే లోగా కేంద్రం నుంచి మరిన్ని వాగ్దానాలు, హామీలు వెలువడే అవకాశం లేకపోలేదు. బహుశా ఆ కారణంగానే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను, ఎన్నికలను వేరు వేరుగా ఉంచేసింది.
ముందుంది ముసళ్ల పండగ
సాధారణంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు బడ్జెట్‌ తర్వాత కూడా ఏడాది పొడవునా ఏదో ఒక కార్యక్రమాన్ని లేదా పథకాన్ని ప్రకటించడం, మూలధన వ్యయాన్ని పెం చుతూపోవడం జరుగుతూనే ఉంటుంది. వాగ్దానాలను, హామీలను బడ్జెట్‌కు పరిమితం చేయాలన్న నియమం ఏమీ లేదు. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రా లకు జరగబోయే ఎన్నిక లను కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకునే బడ్జెట్‌ను రూపొందించిందా అన్నది కొ మ్ములు తిరిగిన రాజకీయ నాయకులకు సైతం అంతుబట్టడం లేదు. ప్రతిపక్ష నాయ కులు ఇప్పటికే ఈ బడ్జెట్‌ మర్మాలను బయటకు తీసే పనిలో నిమగ్నం అయ్యారు. బడ్జెట్లో రైతులకు, వేతన జీవు లకు, మధ్యతర గతివారికి, వయో వృద్ధులకు ప్రకటించిన కొన్ని పథకాలు, కార్యక్రమాలు ఎన్నికలను దృష్టిలో పెట్టు కుని ప్రకటించినవేనని వారు ఢంకా బజాయించి చెబుతు న్నారు. ఎన్నికలలో మధ్యతరగతివారు, మహిళల ప్రభా వం ఎంత బలంగా ఉంటుందన్నది పాలక బీజేపీకి తెలియ కపోలేదు. కాంగ్రెస్‌తో విసుగెత్తి పోయినందువల్లే మధ్య తరగతి వారు ఆ పార్టీని 2014 తర్వాత నుంచి ఓడిస్తూనే ఉన్నారనేది బీజేపీకి తెలిసిన విషయమే. మధ్యతరగతి వారిని సంతృప్తి పరచనందువల్లే కాంగ్రెస్‌ నామరూపాలు లేకుండా పోతోందని బీజేపీ నాయకులు పలువరు గతం లో బహిరంగంగానే వ్యాఖ్యానించడం జరిగింది.
ఈ బడ్జెట్‌లో ఎన్‌డిఏ ప్రభుత్వం మధ్యతరగతి వారి కోసం పన్ను రాయితీలు పెంచింది. ఇది కాకుండా మహిళ ల కోసం ప్రత్యేక పొదుపు పథకాన్ని ప్రకటించింది. రెండేళ్లపాటు 7.5 శాతం వడ్డీతో మహిళలకు మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ను ప్రవేశపెట్టింది. వాస్తవానికి, 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ, తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ మధ్యతరగతి వారు, మహిళలు మోదీనే అభి మానించారు. బీజేపీకే ఓటు వేశారు. మరొక విషయమేమి టంటే, గత ఎన్నికల తర్వాత దేశంలో మహిళా ఓటర్ల సంఖ్య అత్యధికంగా పెరిగింది. అంతే కాదు, గత మార్చి లో జరిగిన ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ గోవా ఎన్నికల్లో మహిళలు అత్యధిక సంఖ్యలో బీజేపీకి మద్దతునిచ్చినట్టు ఢిల్లీలోని సెంటర్‌ ఫర్‌ పాలసీ రిసెర్చ్‌, ఓస్లో యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఇచ్చే నిధులను 33 తగ్గించి, 66,000 కోట్ల రూపాయలు చేసిన ప్పటికీ, గ్రామీణ గృహ నిర్మాణ పథకానికి ఇబ్బ డి ముబ్బడిగా నిధులు పెంచడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్‌ యోజన కింద సుమారు రెండు కోట్ల 90 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఈ ఇళ్లను 2024 మార్చి లోపల నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టు కుంది. అయితే, ఇందులో రెండు కోట్ల ఇళ్లను ఈ ఏడాది డిసెంబర్‌ లోపే పూర్తి చేసి ఇవ్వాలని కేంద్రం బడ్జెట్‌ పరంగా ప్రకటించింది.
ఇంతకూ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడం ఎందుకు జరిగిందని ప్రతిపక్షాలు అభ్య ంతరం చెప్పినప్పుడు, దీనికి నిధులు కేటాయించడమన్నది డిమాండ్‌ సప్లయ్‌ ప్రాతిపదిక మీద ఆధారపడి ఉంటుం దని, అనుబంధ పద్దుల సమయంలో కూడా అవసరమైతే అదనపు నిధులు మంజూరు చేయడానికి అవకాశం ఉంటుందని ఆర్థిక మంత్రి పేర్కొనడం జరిగింది.
2009లో కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి రావ డానికి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం చాలావరకు కారణం. ఇక షెడ్యూల్డ్‌ తెగల అభ్యున్నతి కోసం బడ్జెట్‌లో 15,000 కోట్ల రూపా యలను కేటాయించడం జరిగింది. త్వరలో ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలలో షెడ్యూల్డ్‌ తెగలను ఆకట్టుకోవడా నికే ప్రభుత్వం బడ్జెట్లో వారికి కేటాయింపులు పెంచిందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాల కారణంగా ఆగ్రహావేశాలతో ఉన్న రైతులను తిరిగి తమ వైపు తిప్పుకోవడానికి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో అనేక పథకాలు ప్రకటించింది. ఈ బడ్జెట్‌ను విశ్లేషకులు మెచ్చుకుంటే మెచ్చుకుని ఉండవచ్చు. అయితే, ఓటర్లు మెచ్చుకుని పాలక పక్షాన్ని ఆదరిస్తారా అన్నది వేచి చూడాల్సిన విషయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News