దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు చిట్యాల పట్టణ కేంద్రంలోని శ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా సాగుతున్నాయి. దుర్గ అమ్మవారి ఆలయ సన్నిధిలో దేవీ నవరాత్రుల ఉత్సవాలను ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో గణపతి పూజ కళాష స్తాపనతో ప్రారంభించారు.
మొదటిరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా బంగారు రంగు వస్త్రంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి కట్టె పొంగలి శెనగలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్ప, మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి హాజరయ్యారు. వారికి ఆలయ చైర్మన్ సలాం అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అవరణలో అమ్మవారికి మేళతాళాలతో, డప్పు, నృత్యాలతో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
ఆలయ ప్రధాన అర్చకులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులు పాటు విశేష పూజలు, కలశ స్థాపన, వేద బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పలు పూజ కార్యక్రమాలనీ శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి,మాజీ మార్కెట్ చైర్మన్ జడల ఆది మల్లయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చిన్న మల్లయ్య యాదవ్, కౌన్సిలర్లు పందిరి గీత రమేష్, కోనేటి కృష్ణ,బెల్లి సత్తయ్య,రెముడాల లింగస్వామి, కోఆప్షన్ సభ్యులు పాటి మాధవరెడ్డి, రుద్రవరం పద్మ యాదయ్య, నాయకులు ఏర్పుల పరమేష్, మెండె సైదులు, కాకులారపు బొర్రా రెడ్డి, బొబ్బలి రాంరెడ్డి, పొన్నం లక్ష్మయ్య, గోధుమగడ్డ జలంధర్ రెడ్డి,జిట్టా చంద్రకాంత్, సిలివేరు శేఖర్, మారగోని రమేష్ గౌడ్,ఏళ్ల బయన్న, వేలుపల్లి వెంకటేశ్వర్లు,ఏళ్ల చంద్రశేఖర్,శివకోటి యాదగిరి, ఆగు అశోక్, ఆలయ అధికారి అంబటి నాగిరెడ్డి, డైరెక్టర్లు బుద్ధ విమల కృష్ణమూర్తి, గంజి వెంకటేశం, వరకాంతం నరసింహారెడ్డి, రుద్రారపు లింగస్వామి, జిట్టా సాయిలు, వనమా నిఖిల్ కుమార్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.