Friday, October 4, 2024
Homeట్రేడింగ్Chandana Brothers branch launched in Nallagandla: నల్లగండ్లలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన...

Chandana Brothers branch launched in Nallagandla: నల్లగండ్లలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన సిబియస్

బేబీ వైష్ణవి చైతన్య చేతుల మీదుగా..

నల్లగండ్ల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సిబియస్ (చందన బ్రదర్స్ షాపింగ్ మాల్) ప్రారంభోత్సవం ఘనంగా సాగింది. ప్రముఖ సినీనటి కుమారి వైష్ణవి చైతన్య ప్రారంభించారు.

- Advertisement -

వన్ స్టాప్ మాల్..

అందరికీ అందుబాటు ధరలలో వన్ స్టాప్ మాల్ సిబియస్ (చందన బ్రదర్స్ షాపింగ్ మాల్) నల్లగండ్ల లో ప్రారంభించబడడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. షోరూం మేనేజింగ్ డైరెక్టరు జానా సురేష్ మాట్లాడుతూ 40 సంవత్సరాల అనుబంద సంస్థ తెలుగు రాష్ట్రాలలో ప్రారంభించిన ప్రతి చోటా అతి తక్కువ కాలంలోనే అక్కడి ప్రజల మన్ననలతో నెం.1 షోరూంగా నిలుస్తుండడం తమకు ఎంతో ఉత్సాహాన్ని, మరిన్ని ప్రదేశాలలో ప్రారంభించాలనే ప్రోత్సాహాన్ని అందిస్తుందని, నల్లగండ్ల విషయంలోనైతే షోరూం తీర్చిదిద్దడంలో గానీ, ఇక్కడి ప్రజల అభిరుచికి సరిపడే వస్త్రాలు ఎంపిక చేయడంలోనూ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వలన ఇక్కడి కస్టమర్ల అభిమానాన్ని మరింత వేగంగా పొందుతామని తమకు అపారమైన నమ్మకంముందని తెలియజేసారు.

51 శాతం డిస్కౌంట్..

అన్ని ఆదాయ వర్గాలకూ అందుబాటు ధరలలో నాణ్యమైన సంప్రదాయ వస్త్రాలనూ అలానే మోడ్రన్ ఫ్యాషన్లనందించడంలో మరింత ముందుంటామని అదే తమ విజయ రహస్యమని తెలియజేసారు. దసరా దీపావళి వేడుకల సందర్భంగా అన్ని రకాల వస్త్రాలపై 51% వరకు తగ్గింపు, ప్రతి రూ. 1000 వస్త్రాల కొనుగోలుపై ఒక కూపన్, లక్కీడ్రా, బంపర్ డ్రాలో ప్రతిరోజూ బంగారం గెలుపొందవచ్చు అని అన్నారు.

మొదటి వెళ్లేది ఇక్కడికే..

ప్రముఖ సినీ నటి కుమారి వైష్ణవి చైతన్య మాట్లాడుతూ తాము సిబియస్ (చందన బ్రదర్స్ షాపింగ్ మాల్) ప్రారంభోత్సవంలో భాగం కావడం ఎంతో సంతోషకరమని, ఎందుకంటే హైదరాబాద్ లో ప్రతి చిన్న అవసరానికి, అది ఇంట్లో ఫంక్షన్లకైనా, షూటింగ్ కాస్ట్యూంలకైనా తాము మొదటిగా వెళ్ళేది సిబియస్ (చందన బ్రదర్స్ షాపింగ్ మాల్) కేనని, ఇక్కడ లభించే డిజైన్లూ – వెరైటీలూ వేరెక్కడా లభించవని, అందుకే ఇది హైదరాబాదీల ఫేవరిట్ షోరూంగా మారిందని అన్నారు. ప్రారంభోత్సవ ఆఫర్లతో అతి తక్కువ ధరలతో ఉన్న చీరలను చూసి మురిసిపోతూ షాపింగ్ బుట్టలలో చీరలను నింపేయడం ప్రతి ఫ్లోర్లోనూ కనిపించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News