Saturday, November 23, 2024
HomeదైవంKamareddy: మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు

Kamareddy: మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు

ప్రతి ఇంట్లో బతుకమ్మ సంబరాలు..

కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో బతుకమ్మ వేడుకలను శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో ప్రతి ఇంట్లో బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు.

- Advertisement -

బొడ్డెమ్మతో మొదలుకొని ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఇలా దేని ప్రత్యేకత దానిదే ఉందన్నారు. తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో మహిళలు సంబరాలు చేసుకుంటారు. వేల సంవత్సరాలుగా బతుకమ్మను ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారని గుర్తు చేశారు.

మున్సిపల్ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడుతూ చైర్మన్ గడ్డం ఇందుప్రియ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News