Friday, November 22, 2024
HomeదైవంAP CM CBN on Tirumala sanctity: తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ...

AP CM CBN on Tirumala sanctity: తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయండి

శ్రీవారి సేవ బలోపేతం చేయండి..

తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ఇక్కడ ప్రతిఒక్కరూ పనిచేయాలి.

- Advertisement -

• కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదు.

• ప్రశాతంతకు ఎక్కడా భంగం కలగకూడదు…ఏ విషయంలోనూ రాజీ పడొద్దు.

• భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా చూసుకోండి…ముందస్తు ప్రణాళిక చాలా అవసరం.

• అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతంపైగా పెంచాలని అధికారులకు ముఖ్యమంత్రివర్యులు సూచించారు.

• అటవీ సంరక్షణతో పాటు అడవుల విస్తరణ కోసం వచ్చే 5 ఏళ్లకు ప్రణాళికతో పనిచేయాలన్న సిఎం.

• బయోడైవర్సీటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగిన సిఎం.

• టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకునే విధానంపై అడిగిన సిఎం.

• వచ్చిన ప్రతి భక్తుడు తమ అనుభవాలపై అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలన్న సిఎం.

• భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలన్న సిఎం.

• ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి సూచించిన ముఖ్యమంత్రి.

• లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగింది అని భక్తులు చెపుతున్నారు….ఇది ఎల్లప్పుడూ, పూర్తిగా కొనసాగాలి…మరింత మెరుగుపడాలి.

• ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడండి….అత్యుత్తమ పదార్థాలు మాత్రమే వాడాలి.

• తిరుమలలో విఐపీ సంస్కృతి తగ్గాలి…ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదు. సింపుల్ గా, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా అలంకరణ ఉండాలి….ఆర్భాటం, అనవసర వ్యయం వద్దు.

• టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలి. దేశ విదేశాలనుంచి వచ్చేవారిని గౌరవించుకోవాలి. దురుసు ప్రవర్తన అనేది ఎక్కడా ఉండకూడదు. భక్తులు సంతృప్తితో, అనుభూతితో కొండ నుంచి తిరిగి వెళ్లాలి.

• తిరుమల పేరు తలిస్తే….ఏడుకొండల వాడి వైభవం, ఆధ్యాత్మిక మాత్రమే చర్చకు రావాలి.

• స్విమ్స్ సేవలు కూడా మెరుగుపరచాలి….ఇదొక ప్రత్యేకమైన క్షేత్రం. తిరుమల పవిత్రత కాపాడడం, ఆధ్యాత్మిక విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలి అని ముఖ్యమంత్రి సూచించారు.

*ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థల సహకారంతో శ్రీవారి సేవ (స్వచ్చంద సేవను )మరింత బలోపేతం చేయాలి. తద్వారా భక్తులకు సేవకుల ద్వారా చక్కటి సేవలు అందించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News