కోరుట్ల పట్టణంలోని మాస్ట్రో కాలేజీలో సంబరాలు అంబరాన్ని అంటాయి. బతుకమ్మ సంబరాలు అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతికి అపూరూపమైన బతుకమ్మ పాటలు పాడుతూ డీజే పెట్టుకుని డాన్సులు నృత్యాలు చేశారు.
- Advertisement -
సాంప్రదాయ పద్ధతుల్లో నూతన వస్త్రాలు ధరించి, తెలంగాణ వైభవానికి ప్రతీకగా, హిందూ సంప్రదాయ పద్ధతుల్లో బతుకమ్మను రకరకాల పూలతో అందంగా పేర్చి బతుకమ్మల చుట్టూ అడి పాడి పలువురిని ఆకర్షించారు.
కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఆకుల రాజేష్ ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.