Sunday, October 6, 2024
HomeతెలంగాణRamayampeta: బతుకమ్మ ఉత్సవాల్లో కాలేజ్ ప్రిన్సిపల్ హిమ జ్యోతి

Ramayampeta: బతుకమ్మ ఉత్సవాల్లో కాలేజ్ ప్రిన్సిపల్ హిమ జ్యోతి

ఆచారం, సంప్రదాయం మరువద్దు

రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ హిమజ్యోతి మాట్లాడుతూ మన సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువతరం పైన ఉందని చెప్పారు. కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారి బాలా గౌడ్ మాట్లాడుతూ బతుకమ్మ అంటే బ్రతుకు నిచ్చే పండగ అని కుటుంబ వ్యవస్థలో తల్లి బిడ్డకు ఉన్న అనుబంధాన్ని తెలిపేటటువంటి విధంగా పెద్ద బతుకమ్మకు తోడుగా ఇంకో చిన్న బతుకమ్మ ఉంటుందన్నారు.

- Advertisement -

అమ్మతనాన్ని ప్రకటించే విధంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటారని, ఈ పండగలో వాడేటటువంటి గుమ్మడి పువ్వు స్థిరత్వానికి సంకేతమని, ప్రకృతి నుంచి మనకు లభించిన పువ్వులు ఆకులను ఒక దగ్గర చేర్చి అమ్మవారుగా పూజించి ప్రకృతి ప్రసాదించినటువంటి నీటిలో నిమజ్జనం చేసే ప్రకృతి పండుగను బతుకమ్మగా వర్ణించి చెప్పారు.

నేటి యువత మన తెలంగాణ సంప్రదాయాన్ని, ఆచారాలను మరువద్దని మన వారసత్వాన్ని మనం కాపాడుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ హేమజ్యోతి ఎన్ఎస్ఎస్ అధికారి బాలా గౌడ్, మల్లేశం, సురేష్ గౌడ్, అశోక్ గౌడ్, స్వామి, యాదగిరి, శ్రీశైలం, మస్తాన్వలి, శ్రీదేవి అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News