Saturday, November 23, 2024
Homeహెల్త్Sugar the new poison causes cancer too: తియ్యని విషం చక్కెర..క్యాన్సర్ కూడా

Sugar the new poison causes cancer too: తియ్యని విషం చక్కెర..క్యాన్సర్ కూడా

చక్కెరకు గుడ్ బై ఎప్పుడు చెబుతారు?

చక్కెర తీయటి విషం.. ఎందుకంటే చక్కెర అతిగా తింటే తలెత్తే ఆరోగ్యపరమైన ప్రమాదాలు ఎన్నో. చక్కెర శరీరాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాదు అది కాన్సర్ కారకం కూడా . చక్కెరకు, కాన్సర్ కు ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది. చక్కెర తినడం వల్ల కాలరీలు పెరుగుతాయి.ఇది అందరికీ తెలిసిందే. కానీ.. కాన్సర్ ను చాపకింద నీరులా మనలో పెంచి పోషించేది కూడా చక్కెరే. చక్కెర అందులోనూ గ్లూకోజ్ రూపంలో ఉండే షుగర్ మన శరీరంలోని కణాలకు అందించే ఎనర్జీ అపారం. కార్బోహైడ్రేట్లు తిన్నప్పుడు అది గ్లూకోజ్ గా మారుతుంది. రక్తంలో అది బాగా కలుస్తుంది కూడా.

- Advertisement -

రక్తంలో కలిసిన చక్కెరను ఎనర్జీ కోసం కణాలు గ్రహిస్తాయి. పాంక్రియాస్ ఉత్పత్తి చేసే ఇన్సులిన్ హార్మోన్ గ్లూకోజ్ ను కణాల్లోకి తీసుకోవడం ద్వారా రక్తంలో బ్లడ్ షుగర్ ప్రమాణాలను క్రమబద్ధీకరిస్తుంది కూడా. చక్కెరకు, కాన్సర్ కు ఎంతో సంబంధం ఉంది. చక్కెరను ఎక్కువ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ప్రమాణాలు బాగా పెరుగుతాయి. ఫలితంగా ఇన్సులిన్ లాంటి గ్రోత్ ఫాక్టర్ ఐజిఎఫ్-1 ఉత్పత్తి ఎక్కువవుతుంది. ఇన్సులిన్, ఐజిఎఫ్-1 రెండూ కూడా కణాలను పెరిగేలా చేస్తాయి. షుగర్ ను ఎక్కువచేస్తాయి. దీంతో కాన్సర్ వచ్చే అవకాశాలు కూడా బాగా ఉన్నాయి. ఇన్సులిన్ ఎక్కువ ప్రమాణాల్లో ఉంటే దాన్ని హైపర్ఇన్సులినేమియా అంటారు. దీంతో రొమ్ము కాన్సర్, పెద్ద ప్రేవు కాన్సర్, పాంక్రియాటిక్ లాంటి రకరకాల కాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది.

అలాగే షుగర్ ఎక్కువ తినడం వల్ల ఊబకాయం బారిన కూడా పడతాం. కాన్సర్ మనలో తలెత్తడానికి ఊబకాయం కూడా ఒక కారణమే. ఊబకాయం వల్ల క్రానిక్ ఇన్ఫ్లమేషన్ బారిన పడతాం. అంతేకాదు హార్మోనల్ పరమైన అసమానతలు కూడా తీవ్రంగా తలెత్తుతాయి. ఇవి రెండూ కాన్సర్ ను రేకెత్తించే అవకాశాలు ఉన్నాయి. బాడీ ఫ్యాట్ (అడిపోజ్ టిష్యూ) వల్ల ఈస్ట్రోజన్ ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే మనలో ఈస్ట్రోజన్ ప్రమాణాలు బాగా పెరుగుతాయో అప్పుడు రొమ్ము, ఎండోమెట్రియల్ కాన్సర్లు మనలో తలెత్తే అవకాశాలు బాగా ఉంటాయి.

చక్కెర బాగా ఉన్న డైట్స్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ను పెంచుతాయి. దీంతో కాన్సర్ పుట్టుకొచ్చే అవకాశాలు బాగా పొంచి ఉన్నాయి. ఇన్ఫ్లమేషన్ వల్ల డిఎన్ ఎ దెబ్బతింటుంది. కణాలు బాగా ఎక్కువై శరీరంలో కాన్సర్ బాగా వ్యాపించే అవకాశం ఉంది. అలాగే అతిగా షుగర్ తీసుకోవడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ ను ఎదుర్కొంటాం. ఇందులో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో పాటు అధికరక్తపోటు, కొలెస్ట్రాల్ ప్రమాణాలు భారీగా
నమోదవుతాయి. అంతేకాదు పొట్ట ఎక్కువై ఊబకాయం బారిన పడతాం. మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల రకరకాల కాన్సర్లు సోకే రిస్కు కూడా ఉంది.

పలు అధ్యయనాల్లో చక్కెరకు, కాన్సర్ కు ఉన్న సంబంధం కూడా వెల్లడైంది. చక్కెరను ఎంత అతిగా వినియోగిస్తే కాన్సర్ రిస్కు అంత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని తేలింది. లేబరెటరీల్లో కాన్సర్ సెల్స్ పై జరిగిన పరిశోధనల్లో సాధారణ సెల్స్ కన్నా కాన్సర్ సెల్స్ చక్కెరను ఎక్కువగా తీసుకుంటాయని కూడా వెల్లడైంది. దీన్నే ‘వార్బర్గ్ ఎఫెక్ట్’ అంటారు. గ్లూకోజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల సెల్ పెరుగుదల కూడా వేగంగా జరుగుతుంది. చక్కెరను తక్కువగా వాడేలా కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి. ప్రోసెస్డ్ ఫుడ్స్ లో ఫ్రుక్టోజ్ కార్న్ సిరప్, సుక్రోస్, డెక్స్ ట్రోస్ వంటి రకరకాల పేర్లతో చక్కెర ఉంటుంది. అందుకే ఆ ఫుడ్స్ ను కొనేటప్పుడు తప్పకుండా ఫుడ్ లేబుల్స్ చదవడం ద్వారా వాటిని తినకుండా ఉండొచ్చు.

కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, నట్స్, గింజలు వంటి హోల్ ఫుడ్స్ వంటికి చాలా మంచిది. ఇవి ఎంతో ఆరోగ్యవంతమైన డైట్ కూడా . వీటిల్లో సహజసిద్ధంగానే షుగర్ ప్రమాణాలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిల్లో పీచుపదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని బ్లడ్ షుగర్ ప్రమాణాలను క్రమబద్ధీకరిస్తాయి. కాబట్టి అలాంటి వాటిని తింటే శరీరంలోకి చక్కెర అతిగా పోదు. కాన్సర్ రిస్కు
ఉండదు. ఇక మనం తాగే రకరకాల బేవరేజెస్ లో కూడా చక్కెర పాళ్లు అధికంగా ఉంటాయి. అందుకే పెద్దా, చిన్నా వీటికి దూరంగా ఉంటే చాలా మంచిది. పండ్ల రసాలు, సాఫ్ట్ డ్రింకులు,ఎనర్జీ డ్రింకులు
ఈ కోవలోకే వస్తాయి. అందుకే వీటికి దూరంగా ఉండడం మంచిది. అలాగే చక్కెర ఎక్కువగా ఉన్న స్నాక్స్ కాకుండా ఆరోగ్యవంతమైన స్నాక్స్ అంటే నట్స్, గింజలు, తాజా పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

షుగరీ స్నాక్స్, డెజర్టుల జోలికి మాత్రం వెళ్లొద్దు. ముఖ్యంగా చక్కెర పాళ్లు శరీరంలోకి అతిగా వెళ్లకుండా ఉండాలంటే మైండ్ ఫుల్ ఈటింగ్ చాలా ముఖ్యం. అందుకే ఎమోషనల్ ఈటింగ్ చేయొద్దు. అలాంటప్పుడు చక్కెర పదార్థాలు ఎక్కువగా తినే ప్రమాదం ఉంది. అలా చేస్తే కాన్సర్ రిస్కు లో పడతాం. అంతేకాదు చక్కెర అనేది చాలా పదార్థాలల్లో ఉంటుంది. చక్కెర ఎక్కువగా లేని ఆరోగ్యకరమైన స్నాక్స్, డైట్స్ తీసుకోవడం ఎప్పుడూ మంచిది.

లేకపోతే జీవనశైలికి సంబంధించిన అంటే బిపి, ఊబకాయం, మధుమేమం వంటి జబ్బులు తలెత్తే అవకాశం కూడా ఉంది. అందుకే షుగర్ ను చాలా తక్కువగా తీసుకోవాలి. సమతులాహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. హోల్ ఫుడ్ బేస్డ్ డైట్ ఫాలో అయితే కూడా ఎంతో మంచిది. ఇవి ఫాలో అయితే కాన్సర్ రిస్కు బారిన పడకుండా సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండొచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News