Sunday, October 6, 2024
HomeNewsఉద్యోగం ఇప్పించాలంటూ డిప్యుటీ సీఎం పవన్ ను కోరిన మహిళ

ఉద్యోగం ఇప్పించాలంటూ డిప్యుటీ సీఎం పవన్ ను కోరిన మహిళ

పవన్ కు అప్పీల్..

ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యు.ఎస్. శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ని గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు ఆదివారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో కలిశారు. రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని వాపోయారు.

- Advertisement -

తమకు ఉద్యోగ భద్రత కల్పించి, తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. సమస్య పరిష్కరిస్తామని, పెండింగ్ జీతాలు క్లీయర్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇచ్చారు.

  • ఉద్యోగం ఇప్పించండి సార్…
    ఉద్యోగం తిరిగి ఇప్పించి ఆదుకోవాలంటూ జి.సుజన కుమారి అనే దివ్యాంగురాలు పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసింది. కడప జిల్లా కమలాపురం ల్యాబ్ లో గత పదేళ్లుగా హెల్పర్ గా పని చేస్తున్న తనను మూడు నెలల క్రితం విధులు నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టుకతో ఒక కిడ్నీ లేదని, బరువులను ఎత్తే పనులు చేయలేనని తెలిపారు. ఏ ఆధారం లేని తనకు తిరిగి ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని సుజన కుమారి వేడుకున్నారు.

  • వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ అధికారులతో ఈ విషయమై మాట్లాడతానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్ పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News