Sunday, October 6, 2024
HomeతెలంగాణKarimnagar: అధికారమే కావాలా?మంచి మనసుంటే చాలదా?

Karimnagar: అధికారమే కావాలా?మంచి మనసుంటే చాలదా?

గొప్ప మనసు..

అధికారం ఉన్న లేకపోయిన తను ప్రారంభించిన ఆచారాన్ని అమలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్-దీవెన దంపతులు. వివరాల్లోకి వెళ్తే…గంగాధర మండలం బూరుగుపల్లి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తన నివాసంలో అనాథ పిల్లలకు బతుకమ్మ పండుగ సందర్భంగా బట్టలు పెట్టి, వారికి స్వయంగా భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. పిల్లలు రవిశంకర్ దంపతులని చూసి బావోద్వేగాలకు గురి అయ్యారు. వాళ్ళ కంటి నీరు తుడచి మీకు నేనే తండ్రిని ఇది మీ ఇల్లు, తన ఊపిరి ఉన్నంత కాలం తన సొంత పిల్లల లాగనే తమని కూడా ప్రేమిస్తానని ఆదరిస్తానని మాట ఇచ్చారు. జీవితంలో ఏది అవసరం అయ్యినా ఎప్పుడైనా సరే, సమయం ఏదైనా సరే ఇది తమ పుట్టింటికి లాగా రావొచ్చు, ఏ సమస్య ఉన్న తనని ఒక తండ్రి లాగ బావించి చెప్పాలని పిల్లలకి అభయం ఇచ్చారు.
ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా బట్టలు పెట్టి తన వంతు సహాయం చేసి, అనాథ పిల్లలతో కలిసి భోజనం చేశారు. గతంలో చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ళ సమత, మమతలు తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథలుగా మారారు. ఉండటానికి ఇల్లు లేదు. టెంటు క్రింద ఉండటంతో చలించిపోయిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తను 20వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి ఎన్నారైల సహకారంతో 15లక్షలు జమచేసి వారికి అందించారు.
అంతే కాకుండా పెద్ద అమ్మాయికి మొగ్దుంపూర్ గురుకుల పాఠశాలలో ఉపాధి, ముగ్దుంపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇల్లు ప్రభుత్వం తరపున ఇచ్చారు. చిన్న అమ్మాయి చదువుకోవడానికి కస్తూర్బా విద్యాలయంలో సీటు ఇప్పించారు. పెళ్ళి కూడా దగ్గర ఉండి జరిపిస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -


గతంలో మూడూ సంవత్సరాల క్రితం కెల్లేటి మానస తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోగా 10వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. గతంలో గంగాధర మండలం నారాయణపూర్ ఇస్తార్ పల్లి గ్రామానికి చెందిన కడమంచి అంజలి, శైలజ తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోగా 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
గతంలో గంగాధర మండలం ర్యాలపల్లి గ్రామానికి చెందిన రాజు, మనీషాల తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథలుగా మారారు. తన దృష్టికి రావడంతో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పందించి తన వంతు సహాయంగా 20 వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఎన్నారైలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వర్తకుల సహకారంతో, రైతు బీమా డబ్బులు కలిపి 7 లక్షల రూపాయలు జమచేసి వారికి అందించారు. డబుల్ బెడ్ రూం ఇప్పిస్తానని, పెళ్లి చేస్తానని హామీ ఇచ్చారు.
గతంలో రామడుగు మండలం రుద్రారం గ్రామానికి గుర్రం నవిత తల్లిదండ్రులు అనారోగ్యంతో 2సంవత్సరాల క్రితం చనిపోగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
గతంలో మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం ఏరడుపల్లి గ్రామానికి చెందిన తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా మారారని సోషల్ మీడియాలో చూసి చలించిపోయి సుంకె రవిశంకర్ తనవంతు 10వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు.

రవిశంకర్ పిలుపునందుకొని అమెరికాలో ఉంటున్న ఎన్నారై కుటుంబం పంజాల నరేష్-మధుప్రియలు వాళ్ళ వంతు 50,000/–రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ, యూ ఎస్ ఏ లో ఉన్న మిగితా ఎన్ఆర్ఐ ల ద్వారా 4,50,000/-రూపాయలు జమ చేసారు. సోషల్ మీడియాలో సుంకె రవిశంకర్ పిలుపుతో, పిల్లలపై మానవతా దృక్పథంతో 5 లక్షల రూపాయలు జమచేసి పంపించారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ చేతుల మీదుగా నేడు శంకరపట్నం మండలం ఏరడు పల్లి కి చెందిన అభినయ, ఆలయ లకు అందించారు.
చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామానికి చెందిన కొమ్ము నవదీప్ తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోగా 10వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News