Saturday, November 23, 2024
Homeనేరాలు-ఘోరాలుWarangal: ర్యాగింగ్ భూతం.. వైద్య విద్యార్థినికి శాపం

Warangal: ర్యాగింగ్ భూతం.. వైద్య విద్యార్థినికి శాపం

వరంగల్ నగరంలో ఓ పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమెను హైదరాబాద్ తరలించికిత్స అందిస్తున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) ఏఎస్ఐ గా పని చేస్తున్న నరేందర్ బోడుప్పల్ లోని వెస్ట్ బాలాజీనగర్లో నివాసం ఉంటున్నారు. విధుల్లో భాగంగా వరంగల్ కు రాకపోకలు సాగిస్తున్నారు. అతని కుమార్తె ప్రీతికి కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా సీటు వచ్చింది. దీంతో ప్రీతి మొదటి సంవత్సరం విద్యార్థినిగా చేరింది. ప్రమాదకరమైన రసాయనాన్ని శరీరంలోకి ఎక్కించుకుని ఆత్మహత్యకు యత్నించింది. అంతకు ముందు రోజు రాత్రి తన తమ్ముడితో చివరిసారిగా ఫోనులో మాట్లాడింది. బాధితురాలిని వరంగల్ ఎంజీఎంలో చేర్పించి చికిత్సను అందించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ నుంచి హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. ఐసీయులో ఉంచి చికిత్సను అందిస్తున్నారు.

- Advertisement -

సైఫ్ అనే సీనియర్ విద్యార్థి వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్యకు యత్నించిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ విషయమై బాధితురాలి తండ్రి నరేందర్ నిమ్స్ ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ గత నవంబర్ నెల నుంచి సైఫ్ తన కుమార్తె ప్రీతిని వేధిస్తున్నాడని అన్నారు. ఈ విషయమై కేఎంసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. ప్రీతి ఆత్మహత్యకు యత్నించిన విషయాన్ని ఇప్పటి వరకు కాలేజీ యాజమాన్యం తమకు తెలియజేయలేదన్నారు. తన కుమార్తె తోటి విద్యార్థులకు మద్ధతు కోరినప్పటికీ వారు వెనకడుగు వేశారన్నారు. రెండు సంవత్సరాల పాటు తాము కాలేజీలోనే పనిచేయాలని, తమను కూడా వేధిస్తారని వారు భయపడినట్లు పేర్కొన్నారు. ర్యాగింగ్ కు పాల్పడి వేధించిన సైఫ్ పై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన కూతురు ప్రాణాలను కాపాడాలని వైద్యులను వేడుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News