Monday, October 7, 2024
HomeదైవంKarepalli: అక్టోబర్12 నుండి శ్రీ కోటమైసమ్మ తల్లి జాతర

Karepalli: అక్టోబర్12 నుండి శ్రీ కోటమైసమ్మ తల్లి జాతర

జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు

కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి పంచాయితీలో గల శ్రీ కోటమైసమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో దసరా ఉత్స వాల సందర్భంగా కోటమైనమ్మ జాతర ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

- Advertisement -

5 రోజుల జాతర..

ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలో రెండవ అతిపెద్ద జాతరగా చెప్పుకునే ఈ జాతర ఈనెల అక్టోబర్12 నుండి ప్రారంభమై ఐదు రోజుల పాటు భక్తులను కనువిందు చేయనుంది. కొలిచిన వారికి కొంగుబంగారమై భక్తులు కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ఆలయ ప్రాంగణంలో అక్టోబర్3 గురువారం నుండి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

దసరా రోజు ప్రారంభం..

శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కోటమైసమ్మ అమ్మవారి జాతర ఈనెల 12వ తేదీ విజయదశమి నాడు ప్రారంభమై ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటికీటలాడుతుంది . అయితే ఆలయ కమిటీ వారు ఐదు రోజులకు సంబంధించి జరిగే జాతర ఏర్పాట్లను విస్తృతంగా చేపడుతున్నారు. ఇతర జిల్లాల సమీప గ్రామాల నుండి ఈ జాతరకు లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకొని తన తమ మొక్కులను తీర్చుకుంటారు. వాహన పూజలకు ఇక్కడ చాలా ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో నూతన వాహనాలు కొనుగోలు చేసిన యజమానులు కుటుంబసమేతంగా ఇక్కడికి వచ్చి వాహన పూజలు జరుపుకుంటారు.

……జాతరలో ప్రత్యేక ఆకర్షణగా రంగులరాట్నలు, వినోద యంత్రాలు…….

జాతరకు పురస్కరించుకుని ప్రతి ఏడాది ఇక్కడ చిన్నపెద్దలకు ప్రత్యేక వినోద వాతావరణం నెలకొంటుంది. జాతరకు వచ్చే ప్రజలకు వినోద కార్యక్రమాలు అందించే క్రమంలో రంగుల రాట్నాలు. ఇరత వినోద యంత్రాలు కోలంబస్, సలంబర్, మినీ ట్రైన్, బ్రేక్ డాన్స్, కో అంటో వంటి ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకునే వి ధంగా ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో కొలువైన పలు దేవతా మూర్తుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పంచముఖ ఆంజనేయ స్వామి, మహేశ్వరుడు, వినాయక స్వామి, సరస్వతి ఆమ్మవారు తదితర దేవతామూర్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

కొనసాగుతున్న ఏర్పాట్లు..

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఏర్పాట్లు పనులు పూర్తికావస్తున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా. తాత్కాలిక స్నానపు గదులు, మరుగుదొడ్ల ఏర్పాటు జరిగాయి. అదే విధంగా విద్యుత్, నీరు, ఇతర మౌలిక సదుపాయాలను దేవాదాయ శాఖ వారు కల్పిస్తున్నారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ పర్సా పట్టాభిరామారావు మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా దేవాదాయ శాఖ అధ్వర్యంలో విస్తృత ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ సిబ్బంది సహకారాన్ని తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News