Tuesday, October 8, 2024
Homeనేషనల్Haryana BJP, JK National Conference in lead: హర్యానాలో బీజేపీ, కశ్మీర్ కాంగ్రెస్...

Haryana BJP, JK National Conference in lead: హర్యానాలో బీజేపీ, కశ్మీర్ కాంగ్రెస్ కూటమికే

హర్యానాలో అతి పెద్ద పార్టీగా బీజేపీ

హర్యానాలో సీన్ పూర్తిగా మారిపోయింది. స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతున్న బీజేపీ ఏకంగా 49 స్థానాల్లో లీడ్ లో ఉంది. తొలుత ఇక్కడ కాంగ్రెస్ లీడ్ లో ఉండగా ఏకంగా కాంగ్రెస్ ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ లో సంబరాలు సాగాయి. కానీ సడన్ గా సీన్ మారుతూ, మారిన ట్రెండ్స్ తో బీజేపీ-కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్టు ఫలితాల ట్రెండ్ సాగింది.

- Advertisement -

హర్యానాలో అతిపెద్ద పార్టీగా బీజేపీ..

ఆతరువాత కాసేపటికే కోలుకున్న బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో నంబర్ 1 పార్టీగా లీడ్ లో ఉండగా, కాంగ్రెస్ 36 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఇతర పార్టీలు 4 స్థానాల్లో, ఐ.ఎన్.ఎల్.డి. 2 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి. దీంతో హర్యానాలో అతిపెద్ద పార్టీగా బీజేపీ ఎదగటం ఖాయమైంది.

కేజ్రీవాల్ సొంత రాష్ట్రమైన హర్యానాలో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ కనీసం ఒక్క స్థానంలోనూ లీడింగ్ లో లేకపోవటం ముందే ఊహించిన విషయమని రాజకీయ పండితులు చెబుతున్నారు. కాగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ హర్యానా కాంగ్రెస్ వశమవుతుందని చెప్పగా ట్రెండ్స్ మాత్రం దీనికి భిన్నంగా కనిపిస్తుండటం విశేషం.

కశ్మీర్ కాంగ్రెస్ కూటమిదే..

కాశ్మీర్ మాత్రం కాంగ్రెస్ కూటమి ఖాతాలోనే పడింది. ఆర్టిల్ 370 రద్దు తరువాత ఇక్కడ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ బ్రహ్మాండంగా పుంజుకున్నట్టు ఆది నుంచి సర్వేలన్నీ తేల్చి చెప్పాయి. కానీ అన్ని అస్త్రాలు ప్రయోగించిన బీజేపీ మాత్రం కాశ్మీర్ లో ఎటుతిరిగి సర్కారు ఏర్పాటు చేయటాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావించినా ప్రయోజనం లేకపోయింది. ఇక్కడ ప్రస్తుత ట్రెండ్స్ అన్నీ కాంగ్రెస్ కూటమి అయిన కాంగ్రెస్-ఎన్.సి. పార్టీల అభ్యర్థులు 52 స్థానాల్లో దూసుకుపోతున్నారు.

బీజేపీ మాత్రం కేవలం 26 స్థానాల్లో ఇక్కడ లీడింగ్ లో ఉంది. దీంతో కశ్మీరీ ఓటర్లు బీజేపీని అధికారానికి దూరంగా ఉంచినట్టు తీర్పు వెలువడేలా ట్రెండ్స్ వివరిస్తున్నాయి. కాగా గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప్యూపుల్స్ డెమాక్రటిక్ పార్టీ పీడీపీకి కూడా ఘోర పరాజయం తప్పటం లేదు. ఎన్.సి. తరువాత రాష్ట్రంలో అతిపెద్ద ప్రాంతీయ పార్టీ అయిన పీడీపీ కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితయ్యేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి పీడీపీ 4 స్థానాల్లో మాత్రమే లీడింగ్ లో ఉంది. ఇతరులు 8 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News