Tuesday, October 8, 2024
HomeదైవంNandavaram Banaganapalli: కాత్యాయని అలంకారంలో శ్రీ చౌడేశ్వరి మాత

Nandavaram Banaganapalli: కాత్యాయని అలంకారంలో శ్రీ చౌడేశ్వరి మాత

చౌడమ్మ..

నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్ధానం నందు దేవి శరన్నవరాత్రులలో ఆరవ రోజు మంగళవారం అమ్మవారు కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

- Advertisement -

అమ్మవారిని ప్రాతః కాలం నందే మేల్కొలుపు చేసి అభిషేక, నిత్యార్చన విశేష పూజా క్రతువులు నిర్వహించి యాగశాల నందు ఆలయ వేద పండితుల, అర్చకుల ఆధ్వర్యంలో ఆవాహిత దేవతా పూజలు, విశేష పూజా క్రతువులు, కుమార సూక్త పారాయణ, చండీ పారాయణ, సహస్ర నామార్చన, వేద పారాయణ నిర్వహించారు.

కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్-కార్యనిర్వాహణాధికారిణి జి కామేశ్వరమ్మ, మాజీ చైర్మన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే బనగానపల్లె పట్టణంలోని కొండపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానంలో అమ్మవారు మంగళవారం శ్రీ మంగళ గౌరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News