ఇటీవల కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు.
విజయవాడ మొగల్రాజపురంలోని జయప్రకాష్ నివాసానికి వెళ్ళిన వైయస్ జగన్, ఆయన చిత్రపటానికి పూలు సమర్పించి, నివాళులర్పించారు.
- Advertisement -
అడుసుమిల్లి కుటుంబ సభ్యులతోనూ ఆయన మాట్లాడారు. మాజీ శాసనసభ్యుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా జయప్రకాష్ తనదైన ముద్ర వేసుకున్నారని ఈ సందర్భంగా వైయస్ జగన్ స్మరించారు. జయప్రకాష్ కుమారుడు తిరుమలేష్‌తో పాటు, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన, జయప్రకాష్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.