Tuesday, October 8, 2024
HomeతెలంగాణMinister Thummala: రైతన్న, నేతన్న సంక్షేమమే లక్ష్యం: మంత్రి తుమ్మల

Minister Thummala: రైతన్న, నేతన్న సంక్షేమమే లక్ష్యం: మంత్రి తుమ్మల

వేర్ హౌస్ కార్పొరేషన్ కార్యక్రమాలన్నింటిని డిజటైలేజేషన్ చేసే సాఫ్ట్ వేర్ ను ఆరంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రారంభించారు. క్విక్సీ అనే ఈ సాఫ్ట్ వేర్ ను క్రమంగా వేరే కార్పొరేషన్లకు విస్తరించే యోచనలో అభివృద్ధి చేస్తున్నట్టు మంత్రి తుమ్మల వివరించారు.

- Advertisement -


చేనేత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి, టెస్కో ఎండీ మాట్లాడుతూ, 2024-25 సంవత్సరంలో పది డిపార్ట్ మెంట్ల నుండి 234.80 కోట్ల విలువైన యూనిఫాం, బెడ్డింగ్ మెటీరియల్ కోసం టెస్కోకు ఆర్డర్లు వచ్చాయని, టెస్కో ద్వారా ఈ – కామర్స్, చేనేత లక్ష్మీ వంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ కామర్స్ ద్వారా 2.3 కోట్ల అమ్మకాలు నిర్వహించామన్నారు.

బై బ్యాక్ స్కీం..
బై-బ్యాక్ స్కీం ద్వారా ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ చేస్తున్నట్టు, దీనివల్ల విలువైన ఉత్పత్తులు కస్టమర్లకు అందుతాయన్నారు. ఆర్&డి ద్వారా కొత్త డిజైన్లతో చీరల ఉత్పత్తి చేసి కస్టమర్లను ఆకర్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొత్త డిజైన్లతో పీతాంబరి, గొల్లభామ, ఆర్మూర్ సిల్క్, రామప్ప సిల్క్, టస్సార్ సిల్క్ చీరలు కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.

పవర్ లూమ్ వర్కర్స్ కు ప్రయోజనం..
టెస్కో నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం మంజూరు చేసిన యార్న్ డిపో ద్వారా పవర్ లూమ్ వర్కర్లకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందన్నారు. సెంటర్ ఆఫ్ హ్యాండ్లూమ్ ఎక్సలెన్స్ నిర్మాణం నారాయణపేటలో త్వరలో పూర్తికానుందని, త్వరలోనే అక్కడ సేల్స్ షోరూంలు ఫుడ్ కోర్ట్ నేచురల్ డై యూనిట్, కెమికల్ డై యూనిట్, వీవింగ్ హబ్, ట్రైనింగ్ సెంటర్ అందుబాటులోకి రానున్నాయని, దానివలన వస్త్రాల నాణ్యత పెరుగుతుందన్నారు. స్త్రీ శక్తి మహిళందరికీ నాణ్యమైన చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

పోచంపల్లి టెక్స్ టైల్ పార్కు..

అన్ని రకాల సదుపాయాలతో టెస్కో ఆధ్వర్యంలోని పోచంపల్లి టెక్స్ టైల్ పార్కును అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి సూచించారు. తర్వాత తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, తెలంగాణ ఆయిల్ ఫెడ్, తెలంగాణ మార్క్ ఫెడ్, తెలంగాణ స్టేట్ సీడ్ కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీల గురించి ఒక్కొక్కటిగా ఆయా ఎండీలు వివరించారు.

5 ఏళ్లుగా కుంటుపడింది..

మంత్రి తుమ్మల మాట్లాడుతూ..అన్ని కార్పొరేషన్ల పనితీరు గత 5 సంవత్సరాలుగా కుంటు పడిందని, వాటన్నింటిని గాడిలో పెట్టి తిరిగి పునర్వైభవం తెచ్చేదిశగా చైర్మన్లు, ఎండీలు కృషి చేయాలని, ప్రభుత్వం తరఫున తమ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని, మనందరి బాధ్యత రైతన్న, నేతన్న సంక్షేమమని మరొక్కమారు ఉద్ఘాటించారు.


ఈ సమావేశంలో చేనేత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, వ్యవసాయశాఖ సెక్రటరి రఘునందన్ రావు , సీడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఎండీ ఉదయ్, ఐ.ఏ.ఎస్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగ రాఘవ రెడ్డి, ఎండీ యాస్మిన్ బాషా, ఐ.ఎ.ఎస్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు, ఎండీ లక్ష్మీ, ఐ.ఎ.ఎస్, మార్క్ ఫెడ్ చైర్మన్ మారం గంగారెడ్డి, ఎండీ శ్రీనివాస్ రెడ్డి, కోపరేటివ్ యూనియన్ చైర్మన్ మోహన్ రెడ్డి, ఎండి అన్నపూర్ణ, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, ఎండి రాములు, హౌజింగ్ ఫెడ్ చైర్మన్ నవనీత రావు, ఎండి పూర్ణచందర్, హాకా ఎండి చంద్రశేఖర్ రెడ్డి, సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ ఎండి కేశవులతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News