తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బొల్లారం మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో 77 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన బతుకమ్మ ఘాట్, హై మాస్ లైట్లను బుధవారం ఉదయం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.
అనంతరం ఘాట్ ఆవరణలో జమ్మిచెట్టు మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ పండుగ అన్నారు. బొల్లారం మున్సిపల్ ప్రజల కోసం అన్ని వసతులతో బతుకమ్మ ఘాట్ నిర్మించడం ఆనందకరమన్నారు.
ఈ కార్యక్రమంలో బొల్లారం మున్సిపల్ చైర్ పర్సన్ రోజా బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి, సీనియర్ నాయకులు కౌన్సిలర్ చంద్రారెడ్డి, హనుమంత్ రెడ్డి, వరప్రసాద్ రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.