దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట 44వ జాతీయ రహదారి పక్కన, ఐబి (డాగ్) బంగ్లా సమీపంలో ఉన్న శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవత 7వ రోజు బుధవారం శ్రీ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గొడుగు శ్రీనివాసులు శ్రీవాణి దంపతులు హాజరై ముందుగా గణపతి, గౌరీ పూజ నిర్వహించి, శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవతకు అభిషేకం, కుంకుమార్చన, దేవి నవరాత్రోత్సవ ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించి కొబ్బరి అన్నం నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
మహిళా భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం పోసి, మంగళ హారతులు సమర్పించారు. కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గోనెల నరేందర్ మహేశ్వరి దంపతులు, ఘనాతే విజయ్ కుమార్ గౌతమి ప్రియాంక, గుండు చంద్రశేఖర్, భక్తులు గజగౌని రమాదేవి, సుప్రియ, మానస, పున్న సుధ, సీత, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.