Wednesday, October 9, 2024
HomeదైవంBanaganapalli: కాళరాత్రి అలంకారంలో చౌడేశ్వరి మాత

Banaganapalli: కాళరాత్రి అలంకారంలో చౌడేశ్వరి మాత

చౌడమ్మ తల్లి..

బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలిసిన కాశీ విశాలాక్షి ప్రతిస్పరూపమైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్ధానం నందవరంలో శరన్నవరాత్రులలో ఏడవ రోజు అమ్మవారు కాళరాత్రి అలంకారంలో దర్శనమిచ్చారు.

- Advertisement -

ఉదయం అమ్మవారికి అభిషేకం, నిత్యార్చన విశేష పూజా క్రతువులు నిర్వహించి యాగశాల నందు ఆవాహిత దేవతా పూజలు, విశేష పూజా క్రతువులు, చండీ పారాయణ నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తి ఏడవ రోజు కాళరాత్రి అలంకారంలో భక్తులకు అనుగ్రహించారు. సాయంత్రం అమ్మవారి ప్రాకారోత్సవం ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమంలో ఆలయ అసిస్టంట్ కమిషనర్ మరియు కార్యనిర్వాహణాధికారిణి జి కామేశ్వరమ్మ, మాజీ చైర్మన్ కుమార్ రెడ్డి పాల్గొని భక్తులకి ఎటువంటి ఇబ్బందీ లేకుండా పర్యవేక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News