తెలంగాణ రాష్ట్ర వాడ బలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్ తన స్వగ్రామమైన వీఆర్కేపురం గ్రామంలో ప్రతి ఇంటి ఆడపడుచుకు సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటి మహిళకు బతుకమ్మ కానుకగా చీరలను స్థానిక వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా దామోదర్ మాట్లాడుతూ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనంగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే బతుకమ్మ పండగ తొమ్మిది రోజులు ఘనంగా నిర్వహించుకుని తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ చివరి రోజు సందర్భంగా ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని వెల్లడించారు.
కాగా ఊరి ఆడపడుచులకు చీరలను బహుకరించడం పట్ల గ్రామ మహిళల్లో అనందాలు వెల్లువెత్తాయి.ఈ సందర్భంగా దాతృత్వం చాటుకున్న దామోదర్ కు మహిళలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విఆర్కెపురం మాజీ సర్పంచ్ పూనెం శ్రీదేవి,ఉపసర్పంచ్ శివరాణి,గ్రామస్తులు బద్ది ఆదినారాయణ,డర్ర రాంప్రసాద్,కొప్పుల మల్లయ్య,దినేష్,రవి, వెంకటేశ్వర్లు,పోతురాజు, వెంకటేష్,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.