కొలిమిగుండ్ల మండలం కనకాద్రి పల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం అఖండ ధార్మిక సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. సనాతన ధర్మం పరిరక్షణ, హిందువుల్లో చైతన్యం తేవడం, గ్రామంలో అన్య మతాల ప్రచారాన్ని అడ్డుకోవడం అఖండ ధార్మిక సమ్మేళన ర్యాలీ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద నుండి ప్రారంభించి ఓ హిందూ మేలుకో.. చైతన్యం పొందు కో.. సనాతన ధర్మాన్ని కాపాడుకో ..అనే నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
ప్రతి హిందువు సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని, సంకీర్తనలు ఆలపిస్తూ, కర పత్రములు పంచుతూ, సనాతన ధర్మం గూర్చి ప్రచారం చేశారు. గ్రామంలో అన్యమత ప్రచారం ఎవ్వరూ చేయకూడదని, చేస్తే అడ్డుకోవాలని తెలిపారు. వారి వారి ప్రార్థన స్థలాల్లో వారి మత ప్రచారం చేసుకోవచ్చని తెలిపారు. కొందరు అన్యమత ప్రచారకులు హిందువుల ఇండ్ల వద్దకు వచ్చి వారి మతం గురించి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. త్వరలో గ్రామంలో మా గ్రామంలో అన్యమత ప్రచారం చేయవద్దు అనే బోర్డు కూడా ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో కొలిమిగుండ్ల మండలంలోని అన్ని గ్రామాలు, నంద్యాల ప్రాంతానికి చెందిన సనాతన ధర్మ పరిరక్షణ కార్యకర్తలు పాల్గొన్నారు..