Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుRamagundam: ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారు!

Ramagundam: ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారు!

పోలీస్ బిగ్ బాస్ జరా చూడండి

రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని గోదావరిఖని వన్ టౌన్, టూ టౌన్ పరిధిలో ప్రతి శనివారం, 8వ కాలనీలో సంత వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. రామగుండం ప్రాంత ప్రజలు అధికసంఖ్యలో ప్రతి శనివారం సంతకు వచ్చి నిత్యావసర సరుకులు, కూరగాయాలు తదితర వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. సంతలో ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాటు వేసే అగంతకులు సెల్‌ఫోన్లను, మోటార్ బైక్ లను మూడోకంటికి తెలియకుండా కొట్టేస్తున్నారు.

- Advertisement -

కొంతమంది ముఠాగా ఏర్పడి మోటార్ బైక్ లను, మొబైల్‌ ఫోన్ల చోరీలకు పాల్పడుతున్నట్లు పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. గత మూడు నెలలుగా ప్రతి శనివారం, సంతలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నాయని గోదావరిఖని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మోటార్ బైక్ లు,సెల్‌ఫోన్‌ పోయిన బాధితులు వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు పోయిన 13 మోటార్ బైక్, 30 సెల్‌ఫోన్లు పోయినట్టు సమాచారం. ఇంత టెక్నాలజీ ఉన్న కానీ జేబు దొంగలు మాత్రం పట్టుకోక పోవడంతో అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సంతకు వచ్చే ప్రజలు ఫోన్లు తీసుకురావాలంటేనే జంకుతున్నారు. అంటే ఏ మేరకు ప్రజలు భయపడుతున్నారు అంటే ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటికైనా పోలీసులు మోటార్ బైక్, సెల్‌ఫోన్‌ దొంగలను పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

నిఘ ఎక్కడ..?

అంగట్లో ఇన్ని సెల్ ఫోన్లు, మోటార్ బైక్ చోరికి గురి అవుతున్న పోలీసులు నిఘ పెట్టకపోవడం కోస మెరుపు రామగుండం కమిషనరేట్ ఇలాంటి దొంగతనాలు జరగడం నిఘ వైఫల్యం కారణమని ప్రజల ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత పోలీస్ అధికారులు బైకు దొంగల, సెల్ఫోన్ దొంగలు ఆట కట్టించాలని ప్రజలు పలువురు కోరుతున్నారు.

గోదావరిఖని ఏసీపి రమేష్…

గోదావరిఖని వన్ టౌన్, టూ టౌన్ పరిధిలో నిఘా వ్యవస్థను పటిష్టం చేశామని, దొంగల పైన ప్రత్యేక నిఘ ఉందని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News