Sunday, October 13, 2024
HomeతెలంగాణGarla: గార్ల పోలీస్ స్టేషన్ లో ఆయుధపూజ

Garla: గార్ల పోలీస్ స్టేషన్ లో ఆయుధపూజ

ఆయుధ పూజ..

గార్ల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయుధ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత నిత్యం వినియోగించే ఆయుధాలకు ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా ఉండేందుకు ఎస్సై జీనత్ కుమార్ చేతుల మీదుగా ఆయుధాలను అమ్మవారి పూజ పటం శమీ మొక్క వద్ద ఉంచి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.

- Advertisement -

ఆనవాయితీ ప్రకారం వాహనాలకు పూజలు నిర్వహించారు అనంతరం ఈ సందర్భంగా ఎస్సై జీనత్ కుమార్ మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులతో ప్రజలు పోలీస్ సిబ్బంది ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్స్ బిక్షం జయరాజ్ కానిస్టేబుల్ సతీష్ కిషోర్ సిరాజ్ పాషా పుష్ప శ్రీను ప్రసాద్ రాము రైటర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News