Monday, October 14, 2024
Homeఆంధ్రప్రదేశ్CM CBN review: తుపానుపై సీఎం చంద్రబాబు రివ్యూ

CM CBN review: తుపానుపై సీఎం చంద్రబాబు రివ్యూ

వర్షాలపై..

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక

- Advertisement -

భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్

భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో అధికారులు, ప్రభుత్వ విభాగాల సన్నద్దతపై సమీక్షించిన సిఎం

రాష్ట్రంలో ఈ సీజన్ లో 676 ఎంఎం సరాసరి వర్షపాతానికి గాను ఇప్పటి వరకు 734 ఎంఎం వర్షపాతం నమోదు

18 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం, 8 జిల్లాల్లో సాధారణం, అంతకంటే తక్కవ వర్షపాతం నమోదు

టెలీకాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి సూచనలు, ఆదేశాలు:-
• రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది
• చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలి…పర్యవేక్షణ ఉంచాలి.
• అతి భారీ వర్షాలు ఉండే ప్రాంతంలో ప్రజలకు ముందుగా సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలి
• ప్రజల మొబైల్ ఫోన్లకు భారీ వర్షాలపై మెసేజ్ లు పంపి అలెర్ట్ చేయాలి
• చెరువు కట్టల, కాలువ కట్టల పరిరక్షణపై దృష్టిపెట్టాలి
• వాగులు, కాలువల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి
• రెయిన్ ఫాల్ వివరాలను కూడా రియల్ టైంలో అందుబాటులో ఉండాలి
• అప్రమత్తతో ప్రాణ, ఆస్థినష్టం లేకుండా చేయాలి
• కంట్రోల్ రూంల ఏర్పాటుతో ప్రజల వినతులపై వేగంగా స్పందించాలి
• సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా చెరువులు, రిజర్వాయర్లు నిండేలా ఇరిగేషన్ శాఖ చర్యలు తీసుకోవాలి
• ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కరుస్తాయని తెలిపిన అధికారులు
• ప్రస్తుతం నెల్లూరులో 30 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యిందని వివరించిన అధికారులు…రేపటి నుంచి వర్షాల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపిన అధికారులు
• నెల్లూరు, తిరుపతి జిల్లాలో అవసరమైన ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ సిద్దంగా పెట్టినట్లు తెలిపిన అధికారులు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News