తాండూరు డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని తాండూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ ఫిర్యాదు చేశారు. ఈ నెల 19న నిర్వహించిన శివాజీ జయంతి వేడుకల్లో… శివాజీ చౌక్ లో ఏర్పాటు చేసిన సభలో రాజకీయ నేతల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ వేదికపై మాట్లాడుతుండగా ఆమె చేతిలోని మైక్ ను డీఎస్పీ శేఖర్ గౌడ్ లాకున్నారు. దీంతో తన ప్రసంగాన్ని ముగించకుండానే వేదికపై తన చేతిలోంచి మైక్ లాక్కొని తనను అవమానించారని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు తమ విధులకు ఆటంకం కలిగించారని చైర్ పర్సన్ స్వప్న, కౌన్సిలర్ రాము, మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వీరంతా హోంశాఖ మంత్రిని కలిసి పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా వినతిపత్రం సమర్పించారు.