కారేపల్లి మండలం ఉసిరికాయపల్లి గ్రామంలోని శ్రీ కోటమైసమ్మ అమ్మవారి దర్శించుకోవడాని మూడవ రోజు సోమవారం భక్తులు పోటెత్తారు. దసరా ఉత్సవాలలో భాగంగా అక్టోబర్ 12వ తేదీన ప్రారంభమైన ఈ మహా జాతరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా చుట్టు పరిసర ప్రాంత నుండి భక్తులు అమ్మవారి దర్శించుకునే ముక్కులు చెల్లించుకోవడానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. దర్శనానికి గంటల సమయం పడుతున్న భక్తులు క్యూ లైన్ లో నిలబడి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయ చైర్మన్ పర్సా పట్టాభి రామారావు, దేవాదాయ శాఖ, పోలీసు వారి ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు చేయగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాతర ఘనంగా కొనసాగుతుంది.
ఆలయ ప్రాంగణంలో జాతర మహోత్సవం తిలకించేందుకు కొలంబస్, బ్రేక్ డాన్స్, రంగుల రత్నం, చిన్నపిల్లల ఆట వస్తువులు, రేంజర్, హంస, వినోబ కార్యక్రమాలు తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. గత మూడు రోజులు శనివారం ఆదివారం, సోమవారం ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర మహోత్సవంలో పోలీస్ శాఖ ట్రాఫిక్ ఆంక్షలు కట్టుదిట్టం చేయడంతో భక్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు కారేపల్లి సిఐ తిరుపతిరెడ్డి, ఎస్సై రాజారామ్ పర్యవేక్షణలో కొనసాగుతుంది.