బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం(Well Marked Low Pressure)గా బలపడింది. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది.
రాగల 2 రోజులలో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదిలేందుకు అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్ష సూచన. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశం
తదుపరి 2 రోజులలో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు,దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతుంది
దీని ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణకోస్తా,రాయలసీమలో విస్తృతంగా వర్షాలు
కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు
పలుచోట్ల అతితీవ్రభారీవర్షాలు కురిసే అవకాశం
ఇవాళ పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీవర్షాలు కురిసే అవకాశం
గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీవర్షాలు కురిసే అవకాశం
నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీవర్షాలు కురిసే అవకాశం
మిగత జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు
మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు
ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
~ రోణంకి కూర్మనాథ్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.